Airtel : ఎయిర్ టెల్ కస్టమర్లకు శుభవార్త.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ టెల్.. అందరికీ ఉచితంగా రీచార్జ్?
Airtel : ఎయిర్ టెల్ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే.. ప్రస్తుతం కరోనాతో దేశమంతా పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా వల్ల జనాలు అతలాకుతలం అవుతున్నారు. చివరకు చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎక్కడి నుంచి కరోనా మహమ్మారి వచ్చి అంటుకుంటుందో తెలియదు. మొత్తానికి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు ప్రజలు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా లాక్ డౌనే. అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. దీంతో వలస కూలీలకు, రోజూ వారి పని చేసుకొని బతికే పేద ప్రజలకు, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వలస కూలీల వేతన అయితే వర్ణణాతీతం. వాళ్ల గురించి పట్టించుకునే నాథుడే లేడు. వాళ్లు తమ సొంతూళ్లకు పోలేక.. వేరే ప్రాంతాల్లో బతకలేక అల్లాడిపోతున్నారు. రోజూ ఒక్క పూట భోజనం దొరికినా చాలు అనే స్థితిలో ఉన్నారు వాళ్లు. ఇలా.. అన్ని రాష్ట్రాల్లో జనాల పరిస్థితి ఇలాగే ఉంది.
అయితే.. కొందరు సెలబ్రిటీలు, ఇతరులు, సామాన్యులు ముందుకు వచ్చి తమకు తోచిన సాయం చేస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు కూడా విరాళం ఇస్తున్నారు. నటుడు సోనూ సూద్ కూడా తనకు తోచిన సాయాన్ని చేస్తున్నారు. ఎంత చేసినా.. ఇన్ని కోట్ల మందికి ఎంత వరకు సాయం అందుతుంది. అందుకే.. తమ వంతు సాయాన్ని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ అందించింది. ఒకప్పుడు ఎయిర్ టెల్ అంటేనే ఇండియాలో టాప్ నెట్ వర్క్. జియో రావడంతో దాని నెంబర్ వన్ స్థానం పడిపోయింది కానీ.. జియో లేకపోతే.. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఎయిర్ టెల్.
Airtel : ఆ కస్టమర్లకు ఉచితంగా 49 రూపాయల ప్యాక్
కరోనా కారణంగా.. కనీసం రీచార్జ్ కూడా చేసుకోలేకపోతున్నవాళ్లు.. తమ వాళ్లతో మాట్లాడలేకపోతున్నవాళ్ల కోసం ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రోజు వారీ కూలీలు, కరోనా కారణంగా పనులు లేని వాళ్లు, తక్కువ ఆదాయం కలిగిన సుమారు 5.5 కోట్ల మంది ఎయిర్ టెల్ వినియోగదారులను ఎయిర్ టెల్ సెలెక్ట్ చేసింది. వాళ్లకు ఉచితంగా 49 రూపాయల ప్యాక్ ను అందిస్తున్నట్టు తెలిపింది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. చాలామంది తమ ప్లాన్ ను రీచార్జ్ చేయించుకోలేదు. చేతుల్లో డబ్బులు లేక వాళ్లు కనీసం రీచార్జ్ కూడా చేసుకోలేకపోతున్నారు. అందుకే.. ఎయిర్ టెల్ కస్టమర్లలో కొందరిని సెలెక్ట్ చేసి వాళ్ల కోసం ఈ ప్యాక్ ను ఉచితంగా అందిస్తున్నాం. ఏదో కరోనా సమయంలో మా నుంచి చేస్తున్న చిన్న సాయం ఇది.. అంటూ కంపెనీ అధికారి పేర్కొన్నారు. అలాగే.. 79 రూపాయలతో రీచార్జ్ చేస్తే.. ఇదివరకు ఉన్న ప్రయోజనాలు కాకుండా.. దానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి.. అని ఎయిర్ టెల్ వెల్లడించింది.