Left Over Rice : రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం తింటున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Left Over Rice : రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం తింటున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం

 Authored By jagadesh | The Telugu News | Updated on :28 July 2021,9:20 pm

Left  Over Rice : ఎవరి కిచెన్ లో చూసినా.. రాత్రి పూట కొంచెం అయినా అన్నం మిగులుతుంది. అలా మిగిలిన అన్నాన్ని ఉదయం లేవగానే కొందరు తింటుంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా.. దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని.. చాలామంది ఆ అన్నాన్ని తినేస్తుంటారు. కడుపులో పడేస్తే పోలా అని ఉదయం పూట ఏదుంటే అది.. ఇంత పెరుగో.. లేక పచ్చడో.. లేక రాత్రి పూట మిగిలిన కూరో వేసుకొని తినేస్తారు. బ్రేవ్ తీస్తారు.

can we eat leftover rice in the morning health tips telugu

can we eat leftover rice in the morning health tips telugu

అసలు.. రాత్రి పూట మిగిలిన అన్నాన్ని తినొచ్చా? రాత్రి పూట మిగిలిన అన్నం ఉదయం పూట మంచిగా ఉంటుందా? లేక పాడవుతుందా? దాన్ని తింటే ఏమౌతుంది.. అనే విషయాలు చాలామందికి తెలియదు. ఏదో తినేస్తారు కానీ.. అసలు రాత్రి పూట మిగిలిన అన్నాన్ని తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

can we eat leftover rice in the morning health tips telugu

can we eat leftover rice in the morning health tips telugu

Left Over Rice : రాత్రి పూట మిగిలిన అన్నాన్ని ఉదయమే తినేముందు ఒకసారి ఆలోచించండి

రాత్రి పూట మిగిలిన అన్నంలోకి ఉదయం వరకు బాక్టీరియా చేరుతుంది. రాత్రి నుంచి ఉదయం వరకు ఆ అన్నం అలాగే ఉంటుంది. కనీసం 10 గంటలు ఆ అన్నం వంటింట్లోనే అలాగే ఉండటం, అలాగే.. రాత్రి పూట వేడి ఎక్కువగా ఉంటే.. ఉదయం లేచేసరికి.. ఆ అన్నంలో బాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ బాక్టీరియా ఉన్న అన్నాన్ని తిన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.

can we eat leftover rice in the morning health tips telugu

can we eat leftover rice in the morning health tips telugu

అందుకే.. మిగిలిపోయిన అన్నాన్ని ఉదయం తినకూడదు అని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఫుడ్ పాయిజనింగ్ ప్రతిసారి కాకపోయినా.. ఎప్పుడో ఒకసారి మాత్రం ఫుడ్ పాయిజన్ అవుతుందట. ఎందుకంటే.. కిచెన్ ఉష్ణోగ్రత పెరిగితే.. బాక్టీరియా ఎక్కువగా తయారవుతుందట. దాని వల్ల.. ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిజానికి.. అన్నం వండగానే.. రెండు గంటల లోపు తినేయాలి. ఒకవేళ తినడం లేట్ అయితే కొంత సేపు ఫ్రిజ్ లో పెట్టొచ్చు. అది కూడా ఎక్కువ సేపు ఫ్రిజ్ లో పెట్టకూడదు. అలాగే.. రాత్రి పూట ఫ్రిజ్ లో పెట్టి కూడా ఉదయం పూట తినకూడదు. ఫ్రిజ్ లో పెట్టి మరుసటి రోజు ఏం తినకూడదు. అప్పటికప్పుడు ఒక గంట, రెండు గంటల కోసం మాత్రమే ఫ్రిజ్ లో పెట్టాలి. అలాగే.. అన్నాన్ని చాలామంది వేడి చేసి తింటారు. ఒకసారి అన్నాన్ని వండాక.. మళ్లీ వేడి చేయకూడదు. ఇవన్నీ బాధలు పడే బదులు.. ఎప్పటికప్పుడు తాజాగా అన్నాన్ని వేడి వేడిగా వండుకొని తినేయండి. ఆరోగ్యంగా ఉండండి.

ఇది కూడా చ‌ద‌వండి ==> మామూలోడు కాదు.. అన్నం తినడం ఆపేసి 9 నెలల్లో 60 కిలోలు తగ్గాడు.. ఆయన డైట్ లో ఉన్న ఫుడ్ ఇదే..!

ఇది కూడా చ‌ద‌వండి ==> రోజూ పెరుగు తింటే బరువు పెరుగుతారా? బరువు తగ్గాలంటే ఏం చేయాలి?

ఇది కూడా చ‌ద‌వండి ==> శపించే మొక్కను చూశారా ఎప్పుడైనా? ఈ మొక్క ఆకులను ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సిందే?

ఇది కూడా చ‌ద‌వండి ==>  ఈ చెట్టు ఎన్ని రోగాలను నయం చేస్తుందో తెలుసా? ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది