Cashew Nuts | జీడిపప్పు ఎక్కువ తింటున్నారా? జాగ్రత్త.. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది!
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉండటంతో ఇది హృదయానికి మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు కూడా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కానీ నిపుణుల హెచ్చరిక ప్రకారం, జీడిపప్పును అధికంగా తినడం అస్సలు మంచిది కాదు.

#image_title
రోజు ఎంత తినాలి?
* సాధారణంగా రోజుకు 5–10 పీసులు సరిపోతాయి.
* ఎక్కువ వ్యాయామం చేసే వారు లేదా అథ్లెట్లకు 15–30 పీసులు వరకూ అనుకూలం.
* 30–40 పీసులు లేదా అంతకంటే ఎక్కువ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఎలాంటి సమస్యలు వస్తాయి?
* అధికంగా తింటే బరువు పెరుగుతుంది.
* జీర్ణ సమస్యలు, ఉబ్బరం కలుగుతాయి.
* అలర్జీ ఉన్నవారికి దద్దుర్లు, శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
* ఖాళీ కడుపుతో తింటే అజీర్తి, కడుపులో మంట కలిగించవచ్చు.
ఎవరు తినకూడదు?
* అలర్జీ ఉన్నవారు జీడిపప్పును పూర్తిగా మానేయాలి.
* మూత్రపిండాల సమస్యలున్నవారు వైద్యుల సలహా లేకుండా తీసుకోవద్దు.
* బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు ఎక్కువగా తినకూడదు.
నిపుణులు చెబుతున్నదేమిటంటే, జీడిపప్పులో ఉన్న పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి కానీ ‘ఎక్కువైతే అమృతమూ విషమే’ అన్నట్టే, పరిమిత మోతాదులో తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది.