Good News : డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..!!
Good News ; సామాన్యులకు మోడీ ప్రభుత్వం అదిరిపోయే కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త సర్వీస్ లు లాంచ్ చేయనుంది. విషయంలోకి వెళ్తే చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ మరియు రేషన్ కార్డ్ ఇంకా ఓటర్ ఐడి కార్డులలో కీలకమైన సమాచారానికి సంబంధించి రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ లో అడ్రస్ ఒకచోట ఉంటే రేషన్ కార్డులో మరో అడ్రస్ ఉంటుంది. ఇక ఓటర్ కార్డులో కూడా వేరేచోట ఉన్నట్లు డేటా ఉంటుంది.
అడ్రస్ విషయంలో మాత్రమే కాదు డేట్ అఫ్ బర్త్… ఇంకా పలు సమాచారాలకు సంబంధించి ఒక్కో దానిలో వేరువేరుగా ఉండే అవకాశాలు ఎక్కువ. అయితే ఈ డాక్యుమెంట్లు అన్నిటిలో సమాచారం మొత్తం ఒకే రకంగా అప్ డేట్ చేసుకోవాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే సమాచారం మార్చుకోవడానికి ఒక్కో డాక్యుమెంట్ కోసం ఒక ప్రదేశం మారాల్సి ఉంటుంది. దీంతో సమయం మారాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వం.. ఈ సమస్యలను పరిష్కరించడానికి కొత్త ప్లాట్ ఫామ్ రెడీ చేస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ స్పష్టం చేసింది.
ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సమస్యలను పరిష్కరించడానికి కొత్త సిస్టం రూపొందిస్తుంది. ఈ కొత్త ప్లాట్ ఫామ్ ద్వారా ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు చేసుకోవాలంటే… ఆ మార్పులు ఆటోమేటిక్ గానే.. ఇతర డాక్యుమెంట్లలో అప్ డేట్ అవుతాయి. ఒక్క విషయంలో చెప్పాలంటే ఆధార్ కార్డు లేదని మార్పు చేస్తే అదే సమాచారం ప్రభుత్వం జారీ చేసిన ఇతర కార్డులు డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా రేషన్ కార్డ్ ఓటర్ కార్డులలో అప్ డేట్ అవుతాయి. రాబోతున్న ఈ కొత్త విధానంతో సమాచారం మార్చుకోవటానికి ఎక్కడికి తిరగాల్సిన పని ఉండదు.