Karthika Deepam 2 Today Episode: జ్యో అత్త కూతురు కాదని బాంబ్ పేల్చిన కార్తీక్..దాసు వార్నింగ్..దీపను చంపేలా కొత్త ప్లాన్..!
ప్రధానాంశాలు:
Karthika Deepam 2 Today Episode: జ్యో అత్త కూతురు కాదని బాంబ్ పేల్చిన కార్తీక్..దాసు వార్నింగ్..దీపను చంపేలా కొత్త ప్లాన్..!
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 27వ ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశాయి. జ్యోత్స్న నిజంగా సుమిత్ర కూతురేనా? అన్న అనుమానం ఈరోజు ఎపిసోడ్‌లో మరింత బలపడింది. కాంచన లేవనెత్తిన ప్రశ్నలకు కార్తీక్ ఇచ్చిన సమాధానాలు ఇంట్లోని అందరినీ షాక్‌కు గురిచేశాయి. “జ్యోత్స్న మా అన్నయ్య కూతురు కాదని ఎవరైనా చెప్తారేమో అనిపిస్తోంది. నా అనుమానాలకు సాక్ష్యం కార్తీక్, ఆధారం దీప” అంటూ కాంచన అనడంతో ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆధార్ కార్డు లేదు సరైన ఆధారాలు లేవు అంటూ కార్తీక్ మాటలను తప్పించుకునే ప్రయత్నం చేసినా చివరికి అతడు చేసిన ఒక వ్యాఖ్య అందరినీ నివ్వెరపోయేలా చేసింది.
Karthika Deepam 2 Today Episode: జ్యో అత్త కూతురు కాదని బాంబ్ పేల్చిన కార్తీక్..దాసు వార్నింగ్..దీపను చంపేలా కొత్త ప్లాన్..!
శాంపిల్స్ మిస్టరీ..నిజం బయటపడుతుందా?
జ్యోత్స్న సుమిత్ర అత్త కూతురు కాదు..అందుకే శాంపిల్స్ మ్యాచ్ కాలేదు అని కార్తీక్ చెప్పగానే ఇంట్లో ఉన్నవాళ్లంతా షాక్. అయితే వెంటనే అపోహలు పెరగకుండా ఉండేందుకు కార్తీక్ మాటలను కవర్ చేస్తాడు. నిజమైన కూతురిని తీసుకొస్తేనే క్లారిటీ వస్తుంది అంటూ విషయం దారి మళ్లిస్తాడు. కానీ కాంచనకు మరో అనుమానం. నీకు ముందే శాంపిల్స్ మ్యాచ్ కాలేదని ఎలా తెలుసు? అని కార్తీక్‌ను ప్రశ్నిస్తుంది. డాక్టర్ చెప్పాడని కార్తీక్ చెబితే జ్యోత్స్న మాత్రం టెస్టింగ్ తప్పు అంటుంది. పారు అయితే శాంపిల్స్ మారిపోయాయేమో అని వాదిస్తుంది. అసలు నిజం ఏంటో తెలియక కార్తీక్ కూడా క్లారిటీ వచ్చే రోజు దగ్గర్లోనే ఉంది అంటూ సంచలన వ్యాఖ్య చేస్తాడు. ఇదే సమయంలో పారు షాక్ అయ్యే మరో విషయం బయటపడుతుంది. టెంపుల్‌లో అన్నదానం సమయంలో సుమిత్రపై దాడి చేయాలనుకున్నది జ్యోత్స్నేనని ఆమెకు తెలిసిపోయిందని జ్యో చెప్పడంతో పారు అవాక్కవుతుంది. కొన్ని నిజాలను సరైన సమయంలో బయటపెట్టాలని జ్యోత్స్న అనుకోవడం ఆమె మైండ్ గేమ్‌ని చూపిస్తుంది.
దాసు వార్నింగ్..జ్యో ప్లాన్‌కు బ్రేక్!
ఇక దాసు ఇచ్చిన వార్నింగ్ జ్యోత్స్నను పూర్తిగా కుదిపేస్తుంది. నీ కథ ఇక్కడితో ఆపేయ్. లేదంటే నా అల్లుడు కార్తీక్ అంతు చూస్తాడు అని దాసు హెచ్చరిస్తాడు. మళ్లీ బ్లడ్ శాంపిల్స్ తప్పవు లేకపోతే డీఎన్ఏ టెస్ట్ వరకు వెళ్తారని చెబుతాడు. దీపే శివనారాయణ ఆస్తికి అసలైన వారసురాలు అని ప్రకటించే రోజు దగ్గర్లోనే ఉంది అన్న దాసు మాటలు జ్యోత్స్నకు గుండెల్లో రైలు పరిగెత్తించినట్టయ్యాయి. ఇదంతా జరుగుతుండగా దీప మాత్రం తన తల్లి సుమిత్ర కోసం లోపలే లోపల కుంగిపోతుంది. ప్రేమ ఇవ్వలేకపోయాననే బాధ తల్లిని కాపాడలేననే భయం ఆమె కన్నీళ్లుగా మారుతుంది. జ్యోత్స్న చంపడానికి కూడా వెనుకాడదు అంటూ దీప చెప్పడంతో కార్తీక్ కూడా అప్రమత్తమవుతాడు. అక్కడితో ఆగని జ్యోత్స్న చివరికి రౌడీలతో డీల్ చేస్తుంది. రూ.10 లక్షలు ఇస్తానని చెప్పి దీపను చంపేలా ప్లాన్ చేస్తుంది. రౌడీ కార్తీక్ ఇంట్లోకి చొరబడి దీపపై కత్తితో దాడి చేయబోతాడు. కానీ సమయానికి దీప తప్పించుకోవడం మొలకువ వచ్చి కత్తిని పట్టుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పుతుంది. కార్తీక్ రౌడీని పట్టుకోవాలని ప్రయత్నించినా అతడు తప్పించుకుంటాడు. ఇలా ఉత్కంఠభరితంగా నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగిసింది. రాబోయే ఎపిసోడ్స్‌లో జ్యోత్స్న ప్లాన్ పూర్తిగా బట్టబయలవుతుందా? దీప ప్రాణాలు కాపాడబడతాయా? అన్నదే ఇప్పుడు ప్రేక్షకుల ఆసక్తి.