Work From Home : బ్రేకింగ్.. 50శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం.. ఒమిక్రాన్ నేపథ్యంలో నిర్ణయం..!
Work From Home : దేశంలో కరోనా కల్లోలం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కట్టడే లక్ష్యంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలల్లో… సెక్రటరీ స్థాయికి దిగువన ఉండే సిబ్బందిలో 50 శాతం మందికి వర్క్ ఫ్రం హోమ్ కు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వానికించెందిన అన్ని కార్యాలయాల్లో ఈ నిబంధనలను తక్షణమే అమలు చేయాలని తెలిపింది. జనవరి 31వ తేదీ అనంతరం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. మరోవైపు ఇదే విధంగా మరికొన్ని కంపెనీలు కూడా మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ పై దృష్టి పెడుతున్నాయి. ఒమిక్రాన్ కలకలంతో గ్రేటర్ పరిధిలో ఐటీ ఉద్యోగులు మరికొంత కాలం పూర్తిస్థాయిలో ఇంటి నుంచే పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం బడా ఐటీ కంపెనీల్లో 5 శాతం మంది ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తున్నారు. మధ్యతరహా కంపెనీల్లో 25 శాతం మంది..చిన్న కంపెనీల్లో 70 శాతం మంది ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ ఉద్ధృతి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అన్ని కంపెనీల్లో కలిపి పూర్తిస్థాయి ఉద్యోగులు ఇంటి నుంచే నుంచి పనిచేసే అవకాశాలున్నాయి.