Chandra Babu : చంద్రబాబుకి నాటి సెంటిమెంట్ భయం..!
Chandra Babu : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి కూడా కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. కాకపోతే అవి పాజిటివ్ సెంటిమెంట్లు కావు. నెగెటివ్ సెంటిమెంట్లు. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు లేకపోతే గెలవలేడు అనేది ఒక సెంటిమెంట్ అయితే వరుసగా రెండోసారి కూడా ఓటమి తప్పదేమో అనేది సెకండ్ సెంటిమెంట్. 1999లో కమలం పార్టీతో కలిసి పోటీ చేసి అప్పటి కార్గిల్ వార్ విక్టరీ వాతావరణాన్ని అనుకూలంగా మలచుకున్నాడు. 2004 దాకా నెట్టుకొచ్చాడు. 2004లో కాషాయం పార్టీకి దూరంగా జరగటంతో అధికారం కూడా దూరమైంది. 2009లో కూడా బీజేపీతో జట్టుకట్టకుండా టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలతో మహా కూటమి కట్టాడు. అప్పుడు కూడా పరాజయం తప్పలేదు. దీంతో కళ్లు తెరిచిన చంద్రబాబు నాయుడు 2014లో తెలంగాణ లేని ఏపీలో బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకొని నెగ్గాడు. ఈసారి జనసేన కూడా జత కలిసింది.
Chandra Babu 2019లో పాత కథే..
కేంద్రంలో బీజేపీతో దాదాపు నాలుగేళ్లు హ్యాపీగా కలిసి తిరిగిన చంద్రబాబు నాయుడు చివరికి ఏపీకి ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదనే వంకతో ఎన్డీఏ అలయెన్స్ నుంచి బయటికి వచ్చాడు. 2019లో సింగిల్ గా పోటీ చేసి ఘోరాతిఘోరంగా ఓడాడు. జనసేన సైతం ఒంటరిగానే పోటీ చేసింది. టీడీపీతో కలవలేదు. ఫలితంగా బీజేపీ సహా ముగ్గురూ దెబ్బతిన్నారు. వైఎస్సార్సీపీ బాగా లాభపడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా దాటిపోయింది. ఈ రెండేళ్లలోనే ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా, పలు విధాలుగా దెబ్బతింది. వైఎస్సార్సీపీ చేస్తున్న పొలిటికల్ ప్రెజర్స్ కి తట్టుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి 2009లో ఎదురైన వరుస ఓటమి గుర్తుకొస్తోంది. 2024లో మళ్లీ పరాజయం పాలైతే పార్టీ ఉనికికే ప్రమాదం అని ఆందోళన చెందుతున్నాడు.
ఇద్దరు మిత్రులతో.. ఇంకోసారి.. : Chandra Babu
ఏపీలో ఎటు చూసినా బీజేపీకి గానీ జనసేన పార్టీకి గానీ చివరికి తెలుగుదేశం పార్టీకి సైతం ఏమున్నది గర్వకారణం.. ఎక్కడ చూసినా గర్వభంగం తప్ప.. అన్నట్లే పరిస్థితి తయారైంది. దీంతో 2009 నాటి చరిత్ర రిపీట్ కాకూడదంటే చంద్రబాబు నాయుడు తన ఇద్దరు మిత్రుల(బీజేపీ, జనసేన)తో ఇంకోసారి ఎన్నికల పొత్తు పెట్టుకోక తప్పని దయనీతి స్థితి. అందుకే ఇప్పటి నుంచే ఆయా పార్టీలకు కేటాయించాల్సిన సీట్ల లెక్కల్లో మునిగి తేలుతున్నాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన చూస్తుంటే చంద్రబాబు ఎత్తులు మహాకూటమి మాదిరిగా మరోసారి చిత్తు అవుతాయేమో అనిపిస్తోంది.