TDP : ఇప్పుడు టీడీపీకి పెద్ద దిక్కు ఆయనేనా? చంద్రబాబు ఆయనకు కీరోల్ ఇవ్వడం వెనుక ప్లాన్ ఏంటి?
TDP : తెలుగుదేశం పార్టీలో చినరాజప్ప కీలకంగా మారనున్నారు. పార్టీకి, అధినేతకు నమ్మకమైన నేతగా చినరాజప్ప కొనసాగుతున్నారు. చినరాజప్ప గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కూడా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. అందుకే చినరాజప్పకు 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఏరికోరి పెద్దాపురం టిక్కెట్ ను ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చినరాజప్పకు కీలకమైన హోంమంత్రి పదవిని ఇచ్చారు. అయితే చినరాజప్పది మెతక స్వభావం. నెమ్మదిగా ఉంటూనే పనిని చక్క బెడతారన్న పేరుంది. చినరాజప్పను ముఖ్యమైన విషయాల్లో చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. 2019లో పెద్దాపురం నుంచి తిరిగి గెలిచిన చినరాజప్పను ఇటీవల గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలిగిన సమయంలోనూ చంద్రబాబు వినియోగించుకున్నారు.
TDP : గోదావరి జిల్లాల్లో …
ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ దూకుడు ఎక్కువగా ఉంది. అక్కడ పార్టీ నేతల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య పార్టీని ఇబ్బంది పెడుతుంది. ఈ సమయంలో చినరాజప్ప సేవలను వినియోగించుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.
నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలను పరిష్కరించే బాధ్యతను చినరాజప్పకు అప్పగించనున్నారని తెలిసింది. చినరాజప్ప అయతే స్మూత్ గా డీల్ చేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. అదే జిల్లాలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఉన్నప్పటికీ చినరాజప్పకు ప్రాధాన్యత ఇచ్చేందుకే చంద్రబాబు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. దీనికితోడు చినరాజప్ప లోకేష్ కు ఇష్టుడేనని టాక్ వినిపిస్తోంది. దీంతో మళ్లీ చినరాజప్పకు పార్టీలో కీ రోల్ లభించనుందని సమాచారం. అయితే దీనిపై మిగిలిన సీనియర్లు ఏమంటారన్నదే హాట్ టాపిక్ గా మారింది.