Chandra Babu : ఆ పోస్టు కోసం.. చంద్రబాబు వెతుకుతున్న వ్యక్తి ఎవరో?..
Chandra Babu : తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారనే వార్త టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి Chandra Babu కి ఊహించని షాక్ అని చెప్పొచ్చు. ఇన్నాళ్లూ తనకు విధేయుడిగా ఉన్న ఎల్.రమణ ఇంత పని చేస్తాడని చంద్రబాబు కలలో కూడా అనుకొని ఉండరు. తెలంగాణలో అసలే టీడీపీ నానాటికీ అడుగంటిపోతోందని తెగ ఫీలవుతున్న చంద్రబాబు ఇప్పటిదాకా ఎల్.రమణను అధ్యక్షుడిగా పెట్టి పార్టీని పేరుకే అలా నడిపిస్తున్నారు. తెలుగుదేశానికి తాను నేషనల్ ప్రెసిడెంటుగా ఉండాలంటే ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో విడివిడిగా అధ్యక్షులు ఉండాలి. కాబట్టి ఎల్.రమణను విషయం ఉన్న నాయకుడు కాకపోయినా వినయం ఉన్న లీడర్ అనే ఉద్దేశంతో కొనసాగించాడు.
ఉత్సవ విగ్రహంలా ఎన్నాళ్లిలా?..
ఎల్.రమణ ఇన్ని రోజులూ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఉత్సవ విగ్రహంలా ఉన్నారు. దీంతో తన కళ్ల ముందే టీటీడీపీ నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీల్లో చేరినవారు రాజకీయంగా పైకొస్తున్నారు. ఆయన మాత్రం ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే జఢ పదార్థంలా ఉండిపోతున్నారు. ఊరికే ఉండటంతో బోర్ కొట్టి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాలేదు. దీంతో ఎల్.రమణకు లైట్ వెలిగింది. పక్క చూపులు చూడకపోతే దిక్కూ మొక్కూ లేకుండా పోతాం అని భయమేసింది. దీంతో టీఆర్ఎస్ లోకి జంప్ చేయటానికి రెడీ అయ్యారు.
ఆయన తర్వాత ఎవరు?..: Chandra Babu
ఎల్.రమణ తర్వాత టీటీడీపీ చీఫ్ గా ఎవరిని పెడితే బాగుంటుంది అని నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కానీ ఆయనకు సరైన వ్యక్తి ఎవరూ కనిపించ్లేదు. ఇంకెక్కడున్నారు. కొద్దోగొప్పో ప్రజల్లో పలుకుబడి ఉన్నోళ్లంతా ఎప్పుడో వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడికి నాయకత్వ లక్షణాలున్న ఒక్క మనిషి కూడా తెలంగాణ తెలుగుదేశంలో కనిపించట్లేదంట. అందుకే నందమూరి సుహాసినిని గానీ నందమూరి బాలయ్య బాబుని గానీ రంగంలోకి దింపాలని నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒక్క నాయకుడు పోతే వంద మందిని తయారుచేసేకోగల సత్తా తెలుగుదేశం పార్టీకి ఉందని గొప్పలు చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ కోసం కనీసం ఒక్క ప్రజాదరణ కలిగిన నేతైనా దొరుకుతారో లేదో చూడాలి.