chat sellers fight : కస్టమర్ల కోసం రాడ్లు, కర్రలతో కొట్టుకున్న చాట్ వ్యాపారులు.. వైరల్ వీడియో..!
chat sellers fight : వ్యాపారం అన్నాక ఎవరి మధ్య అయినా సరే పోటీ ఉంటుంది. ఒక్కోసారి కొందరికి కస్టమర్లు ఉండరు. కానీ వారి ప్రత్యర్థుల వద్దకు కస్టమర్లు బాగా వస్తుంటారు. అయితే దీన్ని పర్సనల్‌గా తీసుకుంటేనే సమస్య వస్తుంది. కస్టమర్లు తమ వద్దకు రావాలంటే తమ వద్దకు రావాలని వ్యాపారులు కోరుకుంటారు. కానీ శృతి మించితే వ్యాపారుల మధ్యే పోరు జరుగుతుంది. అది కొట్లాట వరకు వెళ్తుంది. అక్కడ కూడా సరిగ్గా ఇలాగే జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ జిల్లా బరౌత్ ఏరియాలో రెండు వర్గాలకు చెందిన చాట్ వ్యాపారుల మధ్య గొడవ జరిగింది. అది కొట్లాట వరకు దారి తీసింది. కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో రెండు వర్గాలకు చెందిన వ్యాపారులు గొడవ పడ్డారు. అయితే అది హింసకు దారి తీసింది. ఇరు వర్గాలకు చెందిన వ్యాపారులు రాడ్లు, కర్రలను తీసుకుని వచ్చి మరీ సుమారుగా 20 నిమిషాల పాటు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
#WATCH Baghpat: Clash breaks out between two groups of 'chaat' shopkeepers over the issue of attracting customers to their respective shops, in Baraut. Police say, "Eight people arrested, action is being taken. There is no law & order situation there."
(Note: Abusive language) pic.twitter.com/AYD6tEm0Ri
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 22, 2021
అయితే కొంత సేపటికి పోలీసులు వచ్చారు. ఈ క్రమంలో వారు కొందరు స్థానికులతో కలిసి ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఇక ఈ ఘటనలో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందని పోలీసులు తెలిపారు. ఇక ఆ ఘటన మొత్తాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో ఆ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ వీడియోపై మీమ్స్ చేయడంతోపాటు అనేక రకాల కామెంట్లు పెడుతున్నారు. అనవసరంగా కొట్టుకోవడం ఎందుకు, ఎవరి వ్యాపారం వారు చేసుకోవచ్చు కదా.. అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.