Crime News : తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని స్నేహితుడిని భర్త ఏం చేశాడంటే?

 Authored By kranthi | The Telugu News | Updated on :24 January 2023,8:30 am

Crime News : ప్రస్తుతం ఎవరు ఎప్పుడు ఎందుకు ఎవరిని చంపుతున్నారో అర్థం కావడం లేదు. ఆర్థిక కారణాలు కావచ్చు.. వివాహేతర సంబంధం కావచ్చు.. ఈ మధ్య ఒకరిని మరొకరు చంపుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా భార్యాభర్తలు వివాహేతర సంబంధానికి మొగ్గు చూపడం కూడా ఈ హత్యలకు ప్రధాన కారణం. తాజాగా ఓ భార్య.. తన భర్తకు తెలియకుండా ఆ భర్త స్నేహితుడితోనే అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

man kills his friend for having relationship with his wife in up

man kills his friend for having relationship with his wife in up

ఘజియాబాద్ లో మిహ్లాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడి వయసు 40 ఏళ్లు. మిహ్లాల్ కు పూనమ్ అనే భార్య ఉంది. అతడు కూలీ పని చేసుకొని జీవిస్తుంటాడు. వీళ్ల ఇంటికి సమీపంలో అక్షయ్ అనే యువకుడు ఉంటాడు. ఆ యువకుడు, మిహ్లాల్ ఇద్దరు స్నేహితులు. అప్పుడప్పుడు అక్షయ్.. మిహ్లాల్ ఇంటికి వస్తూ ఉండేవాడు.

Crime News : పూనమ్ తో అక్షయ్ కి అక్రమ సంబంధం ఉందేమో అని అనుమానించిన మిహ్లాల్

అయితే.. పూనమ్ తో అక్షయ్ కి అక్రమ సంబంధం ఉందేమో అని మిహ్లాల్ గత కొన్ని రోజులుగా తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. స్థానికులు కూడా పూనమ్.. అక్షయ్ తో ఎక్కువగా మాట్లాడుతుందని చెప్పారు. దీంతో ఖచ్చితంగా అక్షయ్ కు తన భార్యతో అక్రమ సంబంధం ఉందని అనుకున్నాడు. దీంతో అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అదును చూసి అక్షయ్ ని చంపేసి అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత బాడీని బ్యాగులలో సర్ది దూరంగా తీసుకెళ్లి కాలువలో పడేశాడు. అయితే.. ఆ బ్యాగుల నుంచి దుర్వాసన వస్తుండటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాడీ అక్షయ్ దిగా గుర్తించారు. అక్షయ్ నివాసం ఉండే ప్రాంతానికి వచ్చి అందరినీ విచారించారు. మిహ్లాల్ ను కూడా విచారిస్తున్న సమయంలో అతడు డొంక తిరుగుడు సమాధానాలు చెబుతుండటంతో తమదైన శైలిలో విచారించడంతో తానే ఈ నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. కేవలం అనుమానంతో అక్షయ్ ను మిహ్లాల్ మట్టుపెట్టేశాడు.

kranthi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి