Smart Phones : ఫిబ్రవరిలో ఏయే మొబైల్స్ అందుబాటులోకి రానున్నాయో తెలుసా?…రెడ్‌మీ, రియల్‌మీ, ఒప్పోతో పాటు…!
Smart Phones:రోజురోజుకి స్మార్ట్ ఫోన్స్ సరికొత్త ఫీచర్స్‌తో పాటు డిఫరెంట్ మోడల్స్‌తో వినియోగ దారులకి అందుబాటులో వస్తున్నాయి. వివధ కంపెనీలు అందరిని ఆకర్షించేలా సరికొత్త ఫీచర్స్‌తో మొబైల్స్‌ని పరిచయం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో పలు మొబైల్స్ లాంచ్ కాగా, ఇప్పుడు ఫిబ్రవరిలోను రాబోతున్నాయి. ఒప్పో రెనో 7 సిరీస్ భారత మార్కెట్‌లోకి రానుండగా.. రెడ్‌మీ, రియల్‌మీ , సామ్‌సంగ్ , వన్‌ప్లస్‌ఫోన్లు కూడా ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి. ఇందులో ప్రత్యేకమైన మొబైల్స్ ఉన్నాయి.షియోమి సబ్‌బ్రాండ్ రెడ్మీతన నోట్ 11 సిరీస్ లైనప్ నుంచి త్వరలోనే నోట్ 11ఎస్స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. చాలా రోజుల నుంచి ఈ ఫోన్ లాంచింగ్‌కు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎట్టకేలకు రెడ్‌మీ సంస్థ ఈ ఫోన్ లాంచ్ డేట్‌ను ఫిక్స్ చేసింది. భారత్‌లో ఫిబ్రవరి 11న దీన్ని లాంచ్ చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఒప్పో రెనో 7 5జీ, ఒప్పో రెనో 7 ప్రో 5జీ మొబైల్స్ భారత్‌లో ఫిబ్రవరి 4న విడుదల కానున్నాయి. చైనాలో గత సంవత్సరం చివర్లో విడుదలైన ఈ ఫోన్‌లు ఇప్పుడు మన దేశానికి రానున్నాయి. కెమెరాలు ఈ ఫోన్‌లలో ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి.వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 మొబైల్ కూడా భారత్‌లో ఫిబ్రవరిలోనే విడుదల కానుంది. అయితే తేదీని వన్‌ప్లస్ ఇంకా ప్రకటించలేదు. 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమంసిటీ 900 5జీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రానుంది.

check upcoming smartphones list
Smart Phones : సరికొత్త స్టైల్‌లో…
అలాగే వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాగా ఉంటుంది. ఇక రియల్‌మీ నుంచి ఫిబ్రవరిలో రియల్‌మీ 9 ప్రో, 9 ప్రో+ మొబైళ్లు భారత్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 9 ప్రో+ మొబైల్ మీడియాటెక్ డైమంసిటీ 920 5జీ ప్రాసెసర్ అమోలెడ్ డిస్‌ప్లేతో రానుంది. అలాగే రియల్‌మీ 9 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ గెలాక్సీ ఎస్22 మొబైళ్లు గ్లోబల్‌గా ఫిబ్రవరిలో లాంచ్ అవుతాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్రో, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మొబైళ్లు విడుదల కానున్నాయి. ఇలా పలు కంపెనీలకి చెందిన మొబైల్స్ వచ్చే నెలలో అందుబాటులోకి రానున్నాయి.