Congress : కాంగ్రెస్ లోకి ఆ సీనియర్ నేత.. కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు అందరూ ఏకమౌతున్నారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Congress : కాంగ్రెస్ లోకి ఆ సీనియర్ నేత.. కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు అందరూ ఏకమౌతున్నారా?

 Authored By sukanya | The Telugu News | Updated on :16 August 2021,12:37 pm

cheruku sudhakar తెలంగాణ Telangana రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ టార్గెట్ గా రాజకీయ పునరేకీకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి Revanth reddy ఈ దిశగా ముమ్మర యత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్ KCR కు వ్యతిరేకంగా వివిధ వేదికల ద్వారా ఉద్యమిస్తున్న నేతలందరిని ఏకం చేసేలా చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ త్వరలో కాంగ్రెస్ Congress లో చేరనున్నారని తెలుస్తోంది.

telangana congress

telangana-congress

చెరుకు సుధాకర్ తో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ప్రచార కమిటి చైర్మెన్ మధు యాష్కి గౌడ్ చర్చలు జరిపారని సమాచారం. ఆ చర్చలు ఫలించడంతో త్వరలోనే చెరుకు సుధాకర్ అధికారికంగా హస్తం గూటికి చేరనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ లో సముచిత స్థానం ఇస్తామని చెరుకు సుధాకర్ కు పీసీసీ పెద్దలు హామీ ఇచ్చారని చెబుతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన చెరుకు సుధాకర్ కు బలమైన అనుచర గణం ఉంది.

cheruku sudhakar ఆది నుంచీ.. Congress 

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చెరుకు సుధాకర్ కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ లో కీలక నేతగా పని చేసిన చెరుకు సుధాకర్ cheruku sudhakar.. చాలా సార్లు జైలుకు వెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో చెరుకు సుధాకర్ పై పీడీ యాక్ట్ కూడా నమోదైంది. వరంగల్ సెంట్రల్ జైలులో చాలా రోజుల పాటు గడిపారు. కేసీఆర్ తో విభేదాలు రావడంతో టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో పొత్తులో భాగంగా నకిరేకల్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించినా చివరి నిమిషంలో విఫలమైంది. నకిరేకల్ సీటును తెలంగాణ ఇంటి పార్టీకి ఇచ్చారని మొదట ప్రచారం జరిగినా.. తర్వాత సీన్ మారిపోయింది.

cheruku sudhakar Joine in Congress

cheruku sudhakar Joine in Congress

కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే తనకు సీటు రాకుండా పోయిందని చెరుకు సుధాకర్ అప్పట్లో ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెరుకు సుధాకర్ పోటీ చేశారు. గట్టిగానే పోరాడినా అనుకున్నతంగా ఓట్లు సాధించలేకపోయారు. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో చెరుకు సుధాకర్ cheruku sudhakar కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో మొదటి నుంచి చెరుకు సుధాకర్ cheruku sudhakar కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించడంతో చెరుకు సుధాకర్ సానుకూల స్పందించారని తెలుస్తోంది. త్వరలో జరిగే రెండో దళిత గిరిజన దండోరా సభలోనే చెరుకు సుధాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది