Chevella | చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సుపై టిప్పర్ లారీ బోల్తా, మృతుల సంఖ్య ఎందుకు పెరుగుతుంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chevella | చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సుపై టిప్పర్ లారీ బోల్తా, మృతుల సంఖ్య ఎందుకు పెరుగుతుంది?

 Authored By sandeep | The Telugu News | Updated on :3 November 2025,12:00 pm

Chevella | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి వద్ద మీర్జాగూడ సమీపంలో ర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 24 మంది దుర్మరణం పాలయ్యారు. టిప్పర్ డ్రైవర్‌తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 23 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

#image_title

కార‌ణాలు ఇవే..

వివరాల ప్రకారం, తాండూరు నుంచి తెల్లవారుజామున 4.45 గంటలకు హైదరాబాద్ వైపు బయలుదేరిన ఆర్టీసీ బస్సును, కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ లారీ మీర్జాగూడ వద్ద ఢీకొట్టింది. టిప్పర్ అతివేగంగా రావడంతో బస్సు కుడి వైపున చీల్చుకుంటూ వెళ్లింది. ఆ సమయంలో లారీలో ఉన్న సుమారు 15–20 టన్నుల కంకర బస్సులో పడిపోవడంతో , కుడి వైపు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు కంకరలో కూరుకుపోయి మరణించారు.

ఎడమ వైపు కూర్చున్న ప్రయాణికులు కూడా గాయాలతో తల్లడిల్లారు. పోలీసులు జేసీబీల సాయంతో కంకరను తొలగించి వారిని బయటకు తీశారు. అయితే ఆ సమయంలో లారీలో దాదాపు 15 నుంచి 20 టన్నుల వరకు కంకర ఉండగా.. అది పూర్తిగా బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది. దీంతో కుడి వైపు కూర్చున్న ప్రయాణికులు కంకరలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంతోనే మృతుల సంఖ్య పెరిగిందని పోలీసులు చెబుతున్నారు. గాయపడిన వారిని తొలుత చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది