Chiranjeevi : 2024కు పొలిటిక‌ల్ ఆక్సిజ‌న్ పెంచుకుంటున్న చిరంజీవి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : 2024కు పొలిటిక‌ల్ ఆక్సిజ‌న్ పెంచుకుంటున్న చిరంజీవి

 Authored By jagadesh | The Telugu News | Updated on :30 May 2021,10:27 am

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇదివరకు కూడా ఆయన పాల్గొనేవారు. కానీ.. ఇప్పుడు ఎక్కువగా సోషల్ సర్వీస్ మీదనే దృష్టి పెట్టారు. సినీరంగంలో కానీ.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎవ్వరికి ఏ సాయం చేయాలన్నా.. ముందుంటున్నారు చిరంజీవి. నిజానికి ఆయనకు సామాజిక సేవ చేయడం అంటే ఇష్టం. అందుకే.. ప్రజలకు సేవ చేయడం కోసమే ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2008లోనే ఆయన రాజకీయ ప్రవేశం చేసినా.. అప్పట్లో అది వర్కవుట్ కాలేదు. వాస్తవానికి చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు ఆయన సామాజిక వర్గం మొత్తం ఆయన వైపే ఉంది. మెగాస్టార్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో చరిత్రను తిరగరాసిన ఘనత చిరంజీవిది. కానీ.. అదే స్థాయిలో అప్పట్లో రాజకీయాల్లో రాణించలేకపోయారు చిరంజీవి.

chiranjeevi involves in social service tollywood megastar

chiranjeevi involves in social service tollywood megastar

కట్ చేస్తే.. ఏళ్లు గడిచిపోయాయి. తన పార్టీ ప్రజారాజ్యాన్ని చిరంజీవి కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ లో కలిపేసి.. ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు. రాజకీయంగా ఎటువంటి అడుగులు వేయకున్నా.. చిరంజీవి ఇప్పటికీ సామాజిక కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొంటున్నారు. రాజకీయంగా సైలెంట్ అయిన చిరంజీవి… తాజాగా సామాజిక కార్యక్రమాల ద్వారా మళ్లీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గర కావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వెండి తెరకు చాలా ఏళ్ల పాటు దూరమై మళ్లీ తన సినిమా కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు చిరంజీవి.

Chiranjeevi : తనకు ఇప్పటికీ ఉన్న జనాదరణను 2024 ఎన్నికల్లో ఉపయోగించుకోవాలనుకుంటున్నారా?

అయితే.. చిరంజీవికి ఇప్పటికీ ఏమాత్రం జనాదరణ తగ్గలేదు. ఇప్పటికీ ఆయన సినిమాలకు ఉన్న క్రేజే వేరు. ఒకప్పుడు ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారని ఆయన అభిమానులు, అనుచరులు చిన్నబుచ్చుకున్నా.. అది గతం.. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు విడిపోయాయి. రాజకీయాలు కూడా అప్పటికీ ఇప్పటికీ మారిపోయాయి.

chiranjeevi involves in social service tollywood megastar

chiranjeevi involves in social service tollywood megastar

ఈ నేపథ్యంలో చిరంజీవి తనకు అన్నీ కలిసి వస్తే.. 2024 లో మరోసారి ఏపీ సీఎం పీఠం కోసం పోటీ పడుతారు.. అనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. అందుకే.. ఆయన పూర్తి స్థాయిలో సామాజిక కార్యక్రమాల్లోకి దిగారు.. అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే.. రెండు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లాగానే.. ఆక్సిజన్ బ్యాంక్ ను ఆయన ప్రారంభించారని చెబుతున్నారు. ఏది ఏమైనా.. ప్రజలకు మంచి చేయడం కోసం చిరంజీవి లాంటి వాళ్లు ముందుకు రావడం నిజంగా అభినందనీయం. ప్రజలకు సేవ చేయాలని అనుకునే వాళ్లు.. రాజకీయాల్లోనూ రాణిస్తే.. ప్రజలకు మంచే జరుగుతుంది. చూద్దాం మరి.. 2024 ఎన్నికల్లో ఏం జరుగుతుందో?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది