Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నియోజకవర్గంపై క్లారిటీ వచ్చేసింది.. అక్కడి నుంచి పోటీ.. కాంపిటిషన్ మామూలుగా లేదు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నియోజకవర్గంపై క్లారిటీ వచ్చేసింది.. అక్కడి నుంచి పోటీ.. కాంపిటిషన్ మామూలుగా లేదు?

Pawan Kalyan : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నాయి. తమ పార్టీల అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఇక.. ప్రధాన పార్టీల అధినేతలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే దానిపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. 2019 ఎన్నికల్లో ఆయన గాజువాక నుంచి పోటీ చేశారు. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :15 August 2023,4:00 pm

Pawan Kalyan : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నాయి. తమ పార్టీల అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఇక.. ప్రధాన పార్టీల అధినేతలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే దానిపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. 2019 ఎన్నికల్లో ఆయన గాజువాక నుంచి పోటీ చేశారు. భీమవరం నుంచి కూడా పోటీ చేశారు. కానీ.. రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు. మరి.. ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా? లేక ఆ రెండు కాకుండా వేరే నియోజకవర్గం చూసుకుంటారా? అనేదానిపై ఇన్ని రోజులు క్లారిటీ రాలేదు కానీ.. ప్రస్తుతం ఆయన గాజువాకలో వారాహి యాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే కదా.

దీంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తన మనసులో మాట చెప్పేశారు. అసలు తను గాజువాక నుంచి పోటీ చేస్తే ఎందుకు ఓడించారు అనేదే తనకు అర్థం కావడం లేదని గాజువాక మీటింగ్ లో స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. తనను ఆ ఎన్నికల్లో గెలిపించి ఉంటే బాగుండేది కదా అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ.. 2019 ఎన్నికల్లో ఓడించినా సరే.. 2024 ఎన్నికల్లో గాజువాకలో జనసేన ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అంటూ స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. గాజువాకలో జనసేన గెలుస్తుంది కానీ.. జనసేన అభ్యర్థి ఎవరు అనే దానిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.

clarity on pawan kalyan constituency in ap

clarity on pawan kalyan constituency in ap

Pawan Kalyan : పవన్ మరోసారి జనసేన నుంచి పోటీ చేయాల్సిందే

కానీ.. జనసైనికులు, జనసేన నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ ను మరోసారి గాజువాక నుంచే బరిలోకి దిగాలని కోరుతున్నారు. గాజువాకలో పవన్ ఓడిపోయారు అని ఇతర పార్టీల నేతలు పవన్ ను ఎగతాళి చేస్తున్నారు కదా. అందుకే 2024 లో మళ్లీ గాజువాకలో నిలబడి అక్కడి నుంచి గెలిచి చూపించి తన సత్తా చాటాలని అప్పుడే పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో అందరికీ తెలుస్తుందని జనసైనికులు భావిస్తున్నారు. పవన్ మనసులో కూడా అదే ఉన్నట్టు ఆయన ప్రసంగంలో తెలిసిపోయింది. అంటే.. వచ్చే ఎన్నికల్లో గాజువాకలో పోటీ చేసి గెలిచి తొలిసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారన్నమాట.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది