Cleaning : బాగా మాడిపోయిన పాత్రలను ఇంత సులువుగా శుభ్రం చేసుకోవచ్చా…
Cleaning : మనం రోజువారి విధానంలో వంట చేసే క్రమంలో ఏదో పరధ్యానంలో ఉన్నప్పుడు. పలుమార్లు గిన్నెలు మాడిపోతూ ఉంటాయి. టీ, పాలు, అన్నం, కూరలు ఇలా స్టౌ పై పెట్టి మర్చిపోతూ ఉంటాము. అలాంటి సమయంలో గిన్నె ఎంత రుద్దిన పోని విధంగా మాడిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ గిన్నెను ఎలా ట్రై చేసినా కూడా మామూలుగా అవ్వదు. అప్పుడు ఆ గిన్నెలను వాడకుండా పక్కన పడేస్తూ ఉంటాం. అయితే మాడిపోయిన ఈ గిన్నెను మళ్ళీ తిరిగి మామూలుగా చేయడానికి ఒక చిట్కాతో మీ ముందుకు వచ్చాము.
ఈ గిన్నెను మామూలుగా చేయడం కోసం ఇంట్లోనే ఉన్న పదార్థాలతో ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా మాడిపోయిన పాత్రను తీసుకొని శుభ్రం చేసుకోవాలి నీటితో. ఆ తర్వాత ఆ పాత్రలో కొంచెం వెనిగర్ ను, కొంచెం వంటసోడాను వేసి తర్వాత పాత్ర ఎంతవరకు అయితే మాడిందో అంతవరకు నీటిని పోసి ఒక 30 నిమిషాల వరకు దానిని పక్కన పెట్టాలి. తరువాత దీనిలో రెండు స్పూన్ల సర్ఫును వేసి బాగా కలిపి దీనిని మంటపై పెట్టి బాగా మరగబెట్టాలి.
ఈ నీరు మసాలా గాగేటప్పుడు ఒక గరిటెను తీసుకొని లోపల ఉన్న అంత మాడును చిన్నగా రుద్దుతూ ఉండాలి. ఇలా కొద్దిసేపు రుద్ధిన తర్వాత స్టవ్ పైనుంచి దానిని దింపి ఆ నీటిని తీసేయాలి. తరువాత మిగిలిన మాడును కూడా మొత్తం పోయేలా రుద్దాలి. తరువాత ఒక స్టీల్ పీచును తీసుకొని పాత్రల సబ్బుతో దీనిని బాగా రుద్దాలి. ఇలా రుద్దడం వలన మాడిపోయిన గిన్నె మళ్ళీ మామూలుగా అవుతుంది. ఇలా ఎలాంటి పదార్థాలతో మాడిపోయిన పాత్ర అయినా సరే ఇలా చేసి శుభ్రం చేసుకోవచ్చు. ఆ గిన్నెని మళ్లీ వంటలకు వాడుకోవచ్చు.