YS Jagan : ఇలాంటి గొప్ప పనులు జగన్ మాత్రమే చేయగలడు.. శభాష్ అని మోదీ కూడా మెచ్చుకునే మ్యాటర్ ఇది
YS Jagan : ఏపీ సీఎం జగన్.. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన చాలా సంక్షేమ పథకాలు పేదల కోసం రూపొందించినవే. తాజాగా ఓ చిన్నారి ప్రాణం కాపాడటం కోసం ఏకంగా కోటి రూపాయలను జగన్ సాయం చేశారు. ఓ చిన్నారి హనీ చాలా అరుదైన గాకర్స్ అనే వ్యాధితో బాధపడుతోంది. తన తల్లిదండ్రులు సీఎం జగన్ ను కలవడంతో వెంటనే సీఎం జగన్ స్పందించి హనీ వైద్యం కోసం కోటి రూపాయల బడ్జెట్ ను కేటాయించారు. ఆ చిన్నారికి ఉన్న జబ్బు గాకర్స్ కావడంతో ఆ వ్యాధిని తగ్గించాలంటే ఖచ్చితంగా ఖరీదైన ఇంజెక్షన్లను తెప్పించాలి.దాని కోసం కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అత్యంత ఖరీదైన 10 ఇంజక్షన్లను తెప్పించి బాధితులకు అందించారు.
పుట్టుకతోనే ఆ చిన్నారికి గాకర్స్ వ్యాధి సోకింది. కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేరం అనే గ్రామం ఆ చిన్నారి ఊరు. ఈ పాపకు వచ్చిన వ్యాధి వల్ల కాలేయం పనిచేయదు. దీని వల్ల పాపకు అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా కోనసీమ జిల్లా గంటి పెద్దపూడి గ్రామంలో సీఎం జగన్ పర్యటించారు. ఈసందర్భంగా హనీ తల్లిదండ్రులు సీఎం జగన్ ను కలిసి తన కూతురు పరిస్థితిని వివరించారు. సీఎం జగన్ అక్కడ పర్యటన ముగించుకొని వెళ్తుండగా.. హనీ తల్లిదండ్రులు చిన్నారిని కాపాడాలంటూ ప్లకార్డు పట్టుకొని ప్రదర్శించారు. ఆ ప్లకార్డును చూసి సీఎం వెంటనే తన కాన్వాయ్ ని ఆపించారు. వెంటనే కారు దిగి హనీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లారు. వాళ్లతో మాట్లాడారు.
YS Jagan : ప్లకార్డులు పట్టుకొని తమ కూతురును కాపాడాలి అంటూ వేడుకున్న తల్లిదండ్రులు
హనీకి కావాల్సిన వైద్యం గురించి, ఖర్చు గురించి నేను చూసుకుంటా.. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని వెంటనే జిల్లా కలెక్టర్ హిమాన్షును సీఎం జగన్ ఆదేశించారు. దీంతో వెంటనే ప్రభుత్వం హనీ వైద్య ఖర్చుల కోసం రూ.కోటిని విడుదల చేసింది. వెంటనే చిన్నారికి కావాల్సిన ఇంజక్షన్లను కలెక్టర్ పంపణీ చేశారు. ఆ ఒక్క ఇంజక్షన్ ఖరీదు రూ.1,25,000. ప్రతి 15 రోజులకు ఒకసారి పాపకు ఆ ఇంజక్షన్ ఇవ్వాలి. పాపను బతికించడం మాత్రమే కాదు.. పాపకు భవిష్యత్తులో అయ్యే ఖర్చులకు, ఎడ్యుకేషన్ అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందని సీఎం జగన్ ఈసందర్భంగా పాప తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దీంతో పాప తల్లిదండ్రులు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.