‘నీ కుర్చీ కూల్చేది వాళ్ళే అన్నా’ సొంత మనుషుల విషయంలో జగన్ కి వార్నింగ్ ఇస్తున్నారు

 Authored By jagadesh | The Telugu News | Updated on :6 January 2021,12:32 pm

ఏపీ సీఎం వైఎస్ జగన్.. ముందుచూపుకు హేట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే.. ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించి గ్రేట్ అనిపించుకున్నారు. అలాగని.. జగన్ పై విమర్శలు రావడం లేదా.. అంటే వస్తున్నాయి. ఏపీలో దేవాలయాల దాడి విషయంలో సీఎం జగన్ నే అందరూ విమర్శిస్తున్నారు. సీఎం జగన్ మీదనే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అలాగే పార్టీలోనూ కొందరు నేతల వల్ల సీఎం జగన్ కు బ్యాడ్ నేమ్ వస్తోంది. మంత్రులుగా ఉన్న కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యల వల్ల కూడా జగన్ తో పాటు ప్రభుత్వానికి లేనిపోని సమస్యలు వస్తున్నాయి.

cm jagan warned by ysrcp party leaders

cm jagan warned by ysrcp party leaders

రామతీర్థం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు.. ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో ఉన్న నేతలు కాస్త సంయమనం పాటించాలి కానీ.. ఏపీ మంత్రుల తీరు ప్రభుత్వానికి మైనస్ అవుతోంది.

మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలు ఆయనతో పాటు పార్టీకి చెడ్డపేరును తీసుకొచ్చాయి. అలాగే మర్ మంత్రి కొడాలి నాని చేసే వ్యాఖ్యలు కూడా పార్టీ పరువును గంగలో కలిపేలా ఉంటాయి. వీళ్లను సీఎం జగన్ వెనకేసుకు రాబట్టే.. వాళ్లు అలా రెచ్చిపోతున్నారని.. దీనివల్ల జగన్ కు కూడా చాలా చెడ్డ పేరు వస్తోంది.. పార్టీలోని ఇతర నేతలు జగన్ కు సూచిస్తున్నారట. ఇంతలా డ్యామేజ్ చేస్తున్న వీళ్లపై జగన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి