Comedian | ఏంటి.. ఈ టాలీవుడ్ కమెడీయన్ పక్షవాతంతో మంచంలో పడ్డాడా?
Comedian | రామచంద్ర ..ఈ పేరును వినగానే చాలా మందికి గుర్తొచ్చేది ఆయన “వెంకీ”, “సొంతం”, “ఆనందం” సినిమాల్లో చేసిన కామెడీ సీన్స్ గుర్తుకు వస్తాయి. పదుల సంఖ్యలో సినిమాల్లో నటించిన ఈ కమెడియన్, 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా, ఆయనకు వచ్చిన పాత్రలు పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. “వెంకీ” సినిమాలో నటనకు మంచి స్పందన వచ్చినా, ఆ బలం కెరీర్‌ను నిలబెట్టడానికి చాలలేదు.
#image_title
ఆరోగ్య సమస్యలు
ఇటీవల రామచంద్ర ఆరోగ్యంగా పూర్తిగా క్షీణించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆవేదనతో మాట్లాడుతూ .. కాళ్లు చేతులు బాగా లాగుతున్నాయని, డాక్టర్ దగ్గరకు వెళ్తే బ్రెయిన్‌లో రెండు క్లాట్స్ ఉన్నాయని చెప్పారు. ఎడమ చేయి, ఎడమ కాలి పక్షవాతం వచ్చిందని నిర్ధారించారు . ఈ పరిస్థితి ఆయన జీవితం మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎన్నో హాస్య పాత్రలతో ప్రేక్షకులను నవ్వించిన రామచంద్ర ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో, ఆర్థిక కష్టాలతో తీవ్రంగా పోరాడుతున్నాడు.
కెరీర్ ప్రారంభంలో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ, ఒక రోడ్డు ప్రమాదం జీవితాన్ని మార్చేసింది. ప్రమాదం తర్వాత మూడేళ్లు సినిమాలకు దూరమయ్యాను. అప్పటి నుంచి నా పరిస్థితి మారిపోయింది. డబ్బులు అయిపోయాయి. అప్పుల్లో కూరుకున్నాను. చాలా వరకు తీర్చుకున్నా కానీ ఇంకా ఉన్నాయి అని తెలిపారు రామచంద్ర.