Bengaluru Drugs Case : గులాబీ తోటలో గంజాయి మొక్కలు? డ్రగ్స్ కేసుపై కాంగ్రెస్ నేత ఫైర్?
Bengaluru Drugs Case : అక్కడెక్కడో కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన డ్రగ్స్ కేసులో తెలంగాణకు ముడిపడి… ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఈ బెంగళూరు డ్రగ్స్ కేసు మీదనే చర్చ సాగుతోంది. బెంగళూరు డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల ప్రమేయం ఉందంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

congress leader dasoju shravan reveals truths on bengaluru drugs case
దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు దాసోజు శ్రవణ్ కూడా తీవ్రంగా స్పందించారు. బెంగళఊరు డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రమోయం ఉందన్నారు ఆయన.గులాబీ తోటలో గంజాయి మొక్కలను పెంచుతున్నారు. డ్రగ్స్ మాఫియాపై ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు బయటికి రావడం లేదు. వాళ్ల గురించి ఎవ్వరూ ఎందుకు మాట్లాడటం లేదు.. అంటూ దాసోజు ప్రశ్నించారు.
Bengaluru Drugs Case : ప్రభుత్వం వెంటనే డ్రగ్స్ కేసుపై విచారణ జరిపించాలి
బెంగళూరు డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని.. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలే కాదు…. కొందరు మంత్రుల పేర్లు కూడా డ్రగ్స్ కేసులో వినిపిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

congress leader dasoju shravan reveals truths on bengaluru drugs case
గతంలో… టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని.. సినీ నటులపై పెద్ద ఎత్తున దాడులు చేసి… తర్వాత ఆ డ్రగ్స్ కేసును పట్టించుకునే నాథుడే లేడని దాసోజు అన్నారు. కనీసం ఈ డ్రగ్స్ కేసునైనా.. నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.