Love Couples : ప్రేమజంటలు టార్గెట్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేసే కానిస్టేబుల్ బాగోతం బట్టబయలు
Love Couples : కడప జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ కె రామ్మోహన్ రెడ్డి తన బంధువైన అనిల్ కుమార్ రెడ్డిని అనధికారికంగా నియమించి, ప్రేమజంటలు, ఒంటరి మహిళలను బెదిరించి డబ్బులు దోచుకునే పని అప్పగించాడు. పాలకొండల వంటి విహార ప్రదేశాలకు వచ్చిన విద్యార్థులను టార్గెట్ చేసి, వారి ఫోటోలు తీసి, తాను పోలీసు అని బెదిరించడం, వారి వివరాలను డైరీలో రాసుకుని డబ్బులు డిమాండ్ చేయడం చేస్తుండేవాడు.ఇతడి వెనుక ఉండి నడిపించేది మాత్రం కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డి.
కాగా వీరి ఆగడాలకు అనంతపురం జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని వన్నూరు అఖిల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. పాలకొండ జలపాతాల వద్ద తన స్నేహితులతో విహారానికి వచ్చిన ఆమెను అనిల్ బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని అనిల్ బెదిరించడంతో అఖిల తట్టుకోలేక ఫిబ్రవరి 5న హాస్టల్ లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, అనిల్ వ్యవహారం బయటపడింది. అయితే అరెస్ట్ అనంతరం అనిల్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ కుట్రకు సూత్రధారి రామ్మోహన్ రెడ్డిగా అని తెలిపాడు.

Love Couples : ప్రేమజంటలు టార్గెట్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేసే కానిస్టేబుల్ బాగోతం బట్టబయలు
దీంతో కడప జిల్లా ఎస్పీ రామ్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అనిల్ కుమార్ పై గుత్తి, అనంతపురం, ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా, అతని పై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు, ప్రేమజంటలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి సంఘటనలు ఎదురైతే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని రాజంపేట ఏఎస్పీ రామ్నాథ్ సూచించారు.