Chicken Lollipop : కరకరలాడే చికెన్ లాలిపాప్… ఇలా చేయండి…
Chicken Lollipop : చికెన్ తో మనం ఎన్నో వంటకాలను చేస్తుంటాం. ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు చికెన్ తో తయారు చేసిన వివిధ రకాల స్నాక్స్ ని తింటూ ఉంటాం. అందులో చికెన్ 65, చికెన్ డ్రమ్స్ స్టిక్స్, చికెన్ లాలీపాప్స్ మొదలైనవి ముందుగా ఉంటాయి. అయితే ఇవి తిన్నప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఇంట్లో కూడా అదే రుచి వచ్చే విధంగా మనం వీటిని తయారు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చికెన్ లాలిపాప్ ని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు : 1) చికెన్ వింగ్స్ 2) అల్లం వెల్లుల్లి పేస్ట్ 3) కారం 4) చికెన్65 మసాలా 5) వెనిగర్ 6) సోయాసాస్ 7) రెడ్ చిల్లి సాస్ 8) మైదా 9)ఎగ్ వైట్ 10) ఉప్పు 11) ఆయిల్ 12) ఫుడ్ కలర్. తయారీ విధానం : ముందుగా చికెన్ వింగ్స్ 10, 12 ముక్కలను తీసుకొని శుభ్రంగా నీటితో కడగాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలకు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వన్ టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ చికెన్ 65 మసాలా, వన్ టీ స్పూన్ వెనిగర్, అర టీ స్పూన్ సోయాసాస్, వన్ టీ స్పూన్ రెడ్ చిల్లి సాస్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి రెండు గంటలు మ్యారినేట్ చేయాలి. ఆ తర్వాత చికెన్ లాలీపాప్స్ ను వేయించుకునే ముందు వాటిలో ఒక కోడిగుడ్డు లోని తెల్ల సోనా, రెండు టేబుల్ స్పూన్ల మైదా, చిటికెడు ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో వేయించడానికి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడి అయ్యాక అందులో చికెన్ లాలీపాప్ మొక్కలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించిన మొక్కలను బయటకు తీసి టిష్యూ పేపర్ పై పెట్టుకోవాలి. టిష్యూ పేపర్ చికెన్ ముక్కలకు ఉన్న ఆయిల్ ను పీల్చుకుంటుంది. దీంతో కరకరలాడే చికెన్ లాలీపాప్స్ రెడీ అవుతాయి. వీటిని టమోటా కిచప్ తో కలిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. అంతే ఎంతో సింపుల్ గా ఇంట్లోనే చికెన్ లాలిపాప్ ని తయారు చేసుకోవచ్చు.