Jr NTR : సిగ్గుచేటు – వైకాపాలో ఉన్న వారిని నొప్పించొద్దనే ఎన్టీఆర్‌ ఆ వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : సిగ్గుచేటు – వైకాపాలో ఉన్న వారిని నొప్పించొద్దనే ఎన్టీఆర్‌ ఆ వ్యాఖ్యలు

 Authored By aruna | The Telugu News | Updated on :24 September 2022,1:00 pm

Jr NTR : ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లుగా ఉంది ఎన్టీఆర్‌ పరిస్థితి, పాపం ఎన్టీఆర్ ఏ ఉద్దేశంతో ..ఎందుకు తాజాగా స్పందించాడో కానీ ఆయనను చిన్నా లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరు కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అదేనండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం పట్ల ఎన్టీఆర్ యొక్క స్పందన గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఎన్టీఆర్ పొడి పొడిగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించి విమర్శించనట్లుగా విమర్శించాడు అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరి ఎన్టీఆర్ హుందాగా ప్రవర్తించి ప్రభుత్వం యొక్క విజ్ఞతను ప్రశ్నించాడు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే ఎక్కువ శాతం మంది మాత్రం ఎన్టీఆర్ తీరును తప్పుపడుతున్నారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ గారు.. తాత గారు అని కాకుండా ఎన్టీఆర్ అంటూ ఏకవచనంతో సంబోధించడం మరింతగా ఆగ్రహానికి తెర తీస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా ఆ పార్టీలోని ఒక వర్గం నాయకులు ఎన్టీఆర్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. వైకాపాలో ఉన్న తన స్నేహితులను నొప్పించొద్దనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ కాస్త సున్నితంగా స్పందించాడని.. ఆ మాత్రం స్పందించకుంటే పోయేదేముంది అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వైకాపాలో ఉన్న కొడాలి నాని మరియు ఇతర ముఖ్య స్నేహితులతో ఆయనకి ఇప్పటికీ కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలతోనే వైకాపా ప్రభుత్వమును ఆయన గట్టిగా విమర్శించలేక పోతున్నాడు అనేది కొందరి మాట.

Criticisms On Jr NTR Because Of NTR Comments On YCP

Criticisms On Jr NTR Because Of NTR Comments On YCP

గతంలో కూడా ఏపీ ప్రభుత్వం తీరును ఆయన విమర్శించ లేదు, ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మార్పు విషయమై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వైరం ఎందుకు అన్నట్లుగా సీరియస్ గా స్పందించక పోవడంతో సిగ్గు చేటు అంటూ చాలా మంది చాలా రకాలుగా ఎన్టీఆర్ తీరును విమర్శిస్తున్నారు. దేని కోసం వైకాపా ప్రభుత్వానికి మద్దతుగా నువ్వు ఉన్నావంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. గొప్ప కుటుంబం కి చెందిన వాడివంటూ చెప్పుకోవడం మాత్రమే కాదు.. గొప్పగా మాట్లాడాలి. నీ కుటుంబం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా.. నీ కుటుంబానికి అన్యాయం జరిగినా అప్పుడు నువ్వు అండగా లేకపోతే ఉండి దండగా అంటూ కొందరు నందమూరి అభిమానులు ఎన్టీఆర్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ఈ విషయంలో చాలా చిరాకులను ఎదుర్కొంటున్నాడు. వీటన్నింటికీ ఎన్టీఆర్ నుండి సమాధానం వస్తుందా లేదా అనేది చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది