Curd : పెరుగు తెలుసు కదా. పెరుగు లేకుండా రోజూ ముద్ద దిగదు. కొందరైతే పెరుగు పోసుకొనే తినేస్తారు. లొట్టలేసుకుంటూ తినేస్తారు. పెరుగు అనేది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే పెరుగును చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పెరుగన్నం అయితే చాలా ఫేమస్. పెరుగన్నంలో కాసింత మామిడికాయ చట్నీ వేసుకొని తింటే ఉంటుంది.. ఆహా ఆ మజాయే వేరు. అందుకే చాలామంది పరుగన్నంలో పచ్చడి వేసుకొని లాగించేస్తుంటారు. కొందరైతే పెరుగును ఎలా పడితే అలా తినేస్తారు. కూరలో కలుపుకొని తింటారు. ఇంకా ఉల్లిగడ్డలతో కలుపుకొని తింటారు. ఇలా.. రకరకాలుగా పెరుగను వాడుతుంటారు.
నిజానికి.. పెరుగు అనేది శరీరానికి మంచిదే. అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అవి శరీరానికి ఎంతో మంచి చేస్తాయి. అంతవరకు బాగానే ఉంది కానీ.. పెరుగును కొన్ని ఆహార పదార్థాలతో తీసుకోకూడదట. ఏఏ ఆహార పదార్థాలతో పెరుగును తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగును మామిడి పండుతో కలిపి అస్సలు తీసుకోకూడదు. అలా తింటే.. చర్మం మీద అలర్జీ వస్తుంది. చర్మ సమస్యలు కూడా వస్తాయి. చాలామంది వేసవి కాలంలో పెరుగుతో పాటు.. మామిడి పండును తింటుంటారు. అది చాలా తప్పు. మామిడి పండుతో పెరుగును అస్సలు తినకూడదు.
చాలామంది పెరుగుతో రైతా చేస్తుంటారు. అందుతో ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తుంటారు. అది చాలా డేంజర్. ఎందుకంటే.. ఉల్లిపాయ ముక్కలలో పెరుగును తినడం అంత మంచిది కాదు. ఉల్లిగడ్డ శరీరంలో వేడిని పుట్టిస్తుంది. పెరుగేమో చల్లదనాన్ని ఇస్తుంది. ఈ రెండూ విరుద్ధ ప్రయోజనాలు కలిగేలా చేస్తాయి కాబట్టి… వీటిని తినడం వల్ల.. సోరియాసిస్, లేదా చర్మ సమస్యలు, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
చేపల కూర తిన్నప్పుడు పెరుగును తినకూడదు. అలా తింటే.. గ్యాస్, అల్సర్ సమస్యలు వస్తాయి. ఎసిడిటీ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. పెరుగుతో పాటు.. చేపల కూరను అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ చేపల కూర తింటే.. ఆరోజు పెరుగు తినడం మానేయండి.
ఇది కూడా చదవండి ==> క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వెంటనే జ్యూస్ చేసుకొని తాగేస్తారు..!
ఇది కూడా చదవండి ==> ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు.. ఔషధాల గని ఈ మొక్క.. దీని వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఇది కూడా చదవండి ==> తులసి కషాయం.. తయారీ ఉపాయం.. రోగాల నుంచి తప్పే అపాయం..!
ఇది కూడా చదవండి ==> ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. నేల ఉసిరి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.