Tulasi : తులసి కషాయం.. తయారీ ఉపాయం.. రోగాల నుంచి తప్పే అపాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tulasi : తులసి కషాయం.. తయారీ ఉపాయం.. రోగాల నుంచి తప్పే అపాయం..!

 Authored By kondalrao | The Telugu News | Updated on :1 July 2021,12:00 pm

Tulasi : మన శరీరంలో రోగ నిరోధక శక్తి సరిగా ఉంటే అదే సర్వ రోగ నివారిణిలా పని చేస్తుంది. కరోనా వచ్చినా కోలుకోవచ్చు. మరేదైనా ఎదుర్కోవచ్చు. మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే బలవర్ధకమైన ఆహారం తినాలి. వాతావరణ పరిస్థితులు బాగాలేనప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. కషాయం గట్రా పానీయాలు తాగాలి. అందునా తులసి ఆకులతో తయారుచేసే కషాయమైతే మరీ మంచిది. అయితే దాన్ని ఎలా తయారు చేస్తారో చాలా మంది తెలియకపోవచ్చు. అందుకోసమే ఈ కథనం. ఎండా కాలం పోయి వానా కాలం వచ్చింది. దీంతో వాతావరణం మారింది. ఫలితంగా చాలా మందికి జలుబు చేస్తోంది. దగ్గు, జ్వరం బారిన పడుతున్నారు. వీటి నుంచి గట్టెక్కాలంటే తులసి కషాయం తాగటం బెటర్.

tulasi tulasi leaves decotion increase immunity power

tulasi-tulasi-leaves-decotion-increase-immunity-power

ఏమేం కావాలి?.. ఎంతెంత మోతాదులో..

నాలుగు గ్లాసుల నీళ్లు, టీ స్పూన్ లో పావు వంతు పసుపు, ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క, నాలుగు లేదా ఐదు తులసి ఆకులు, నాలుగు లేదా ఐదు మిరియాలు, రెండు లవంగాలు, టీ స్పూన్ లో సగం వాము, మూడు యాలకులు కావాలి. తులసి కషాయాన్ని తయారుచేయటానికి ఇలా మొత్తం ఎనిమిది పదార్థాలు అవసరం. వీటి ఖరీదంతా పట్టుమని ఇరవై రూపాయలు కూడా ఉండదు. అతి తక్కువ రేటుకే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకునే మార్గం తులసి కషాయం.

tulasi tulasi leaves decotion increase immunity power

tulasi-tulasi-leaves-decotion-increase-immunity-power

ఎలా తయారుచేస్తారు?..: Tulasi

ఒక గిన్నెలో నీళ్లు పోసి వాటిని బాగా ఆవిర్లు వచ్చే వరకు మరిగించాలి. ఇప్పుడు పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ ఆ వేడి నీటిలో వేయాలి. తర్వాత కూడా పావు గంట సేపు ఆ మిశ్రమాన్ని స్టవ్ మీదే ఉంచి ఇంకా బాగా మరిగించాలి. గిన్నెలోని నీళ్లు సగానికి సగం వచ్చేదాక వేడి చేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని వడకట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ఈ కషాయాన్ని రోజుకొకసారి తాగితే మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తులసి ఆకుల ప్లేసులో మధురం చూర్ణం కూడా కలపొచ్చు. దీనివల్ల టేస్ట్ మారుతుందేమో గానీ ప్రయోజనాలు మాత్రం సేమ్.

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది