Curd : పెరుగును తెగ లాగించేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Curd : పెరుగును తెగ లాగించేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు?

Curd : పెరుగు తెలుసు కదా. పెరుగు లేకుండా రోజూ ముద్ద దిగదు. కొందరైతే పెరుగు పోసుకొనే తినేస్తారు. లొట్టలేసుకుంటూ తినేస్తారు. పెరుగు అనేది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే పెరుగును చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పెరుగన్నం అయితే చాలా ఫేమస్. పెరుగన్నంలో కాసింత మామిడికాయ చట్నీ వేసుకొని తింటే ఉంటుంది.. ఆహా ఆ మజాయే వేరు. అందుకే చాలామంది పరుగన్నంలో పచ్చడి వేసుకొని లాగించేస్తుంటారు. కొందరైతే పెరుగును ఎలా పడితే […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 July 2021,12:15 pm

Curd : పెరుగు తెలుసు కదా. పెరుగు లేకుండా రోజూ ముద్ద దిగదు. కొందరైతే పెరుగు పోసుకొనే తినేస్తారు. లొట్టలేసుకుంటూ తినేస్తారు. పెరుగు అనేది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే పెరుగును చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పెరుగన్నం అయితే చాలా ఫేమస్. పెరుగన్నంలో కాసింత మామిడికాయ చట్నీ వేసుకొని తింటే ఉంటుంది.. ఆహా ఆ మజాయే వేరు. అందుకే చాలామంది పరుగన్నంలో పచ్చడి వేసుకొని లాగించేస్తుంటారు. కొందరైతే పెరుగును ఎలా పడితే అలా తినేస్తారు. కూరలో కలుపుకొని తింటారు. ఇంకా ఉల్లిగడ్డలతో కలుపుకొని తింటారు. ఇలా.. రకరకాలుగా పెరుగను వాడుతుంటారు.

curd health benefits telugu

curd health benefits telugu

నిజానికి.. పెరుగు అనేది శరీరానికి మంచిదే. అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అవి శరీరానికి ఎంతో మంచి చేస్తాయి. అంతవరకు బాగానే ఉంది కానీ.. పెరుగును కొన్ని ఆహార పదార్థాలతో తీసుకోకూడదట. ఏఏ ఆహార పదార్థాలతో పెరుగును తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Curd : వీటితో పెరుగును అస్సలు తినకండి

పెరుగును మామిడి పండుతో కలిపి అస్సలు తీసుకోకూడదు. అలా తింటే.. చర్మం మీద అలర్జీ వస్తుంది. చర్మ సమస్యలు కూడా వస్తాయి. చాలామంది వేసవి కాలంలో పెరుగుతో పాటు.. మామిడి పండును తింటుంటారు. అది చాలా తప్పు. మామిడి పండుతో పెరుగును అస్సలు తినకూడదు.

curd health benefits telugu

curd health benefits telugu

చాలామంది పెరుగుతో రైతా చేస్తుంటారు. అందుతో ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తుంటారు. అది చాలా డేంజర్. ఎందుకంటే.. ఉల్లిపాయ ముక్కలలో పెరుగును తినడం అంత మంచిది కాదు. ఉల్లిగడ్డ శరీరంలో వేడిని పుట్టిస్తుంది. పెరుగేమో చల్లదనాన్ని ఇస్తుంది. ఈ రెండూ విరుద్ధ ప్రయోజనాలు కలిగేలా చేస్తాయి కాబట్టి… వీటిని తినడం వల్ల.. సోరియాసిస్, లేదా చర్మ సమస్యలు, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

curd health benefits telugu

curd health benefits telugu

చేపల కూర తిన్నప్పుడు పెరుగును తినకూడదు. అలా తింటే.. గ్యాస్, అల్సర్ సమస్యలు వస్తాయి. ఎసిడిటీ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. పెరుగుతో పాటు.. చేపల కూరను అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ చేపల కూర తింటే.. ఆరోజు పెరుగు తినడం మానేయండి.
ఇది కూడా చ‌ద‌వండి ==> క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వెంటనే జ్యూస్ చేసుకొని తాగేస్తారు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు.. ఔషధాల గని ఈ మొక్క.. దీని వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

ఇది కూడా చ‌ద‌వండి ==> తులసి కషాయం.. తయారీ ఉపాయం.. రోగాల నుంచి తప్పే అపాయం..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. నేల ఉసిరి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది