7th Pay Commission : డీఏ, జీతాల పెంపుపై గుడ్ న్యూస్.. కొత్త సంవత్సరం పూట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నాయా..?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సరం ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను ప్రభుత్వం త్వరలో రివైజ్ చేయనుంది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై చాలా రోజుల నుంచి ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2.57 నుంచి 3.68 శాతానికి ఫిట్ మెంట్ ను పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అయితే.. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేబినేట్ త్వరలో భేటీ కానుంది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై 2023 కేంద్ర బడ్జెట్ తర్వాత నిర్ణయం తీసుకోనుంది. హోలీ సమయంలో కేంద్రం.. ఫిట్ మెంట్ పెంపుపై నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఒకవేళ ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను మూడు శాతానికి పెంచినా ఉద్యోగుల జీతాలు ఒక్కసారిగా పెరగనున్నాయి.
7th Pay Commission : ఫిట్ మెంట్ 3.68 కు పెరిగిన ఉద్యోగుల జీతాలు ఎంత పెరగనున్నాయి?
ఇప్పటికే 28 సెప్టెంబర్ 2022న కేంద్రం 4 శాతం డీఏ, డీఆర్ పెంపునకు అవకాశం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెరగడం వల్ల జీతాలు కూడా పెరిగాయి. జులై 1, 2022 నుంచే ఆ పెంపు అమలులోకి వచ్చింది. డీఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.6591.36 కోట్ల భారం పడనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.4394.24 కోట్ల భారం పడనుంది.