7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే డీఏ, డీఆర్ పెంపుపై కేంద్రం ప్రకటన.. ఒక్కసారిగా పెరగనున్న జీతాలు
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. డీఏ, డీఆర్ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. తాజాగా ఏడో వేతన సంఘం సిఫారసు ప్రకారం.. డీఏ, డీఆర్ రేట్ ను కేంద్ర ప్రభుత్వం పెంచింది. పలు రాష్ట్రాలు తమ ప్రభుత్వ ఉద్యోగుల కోసం డీఏను పెంచాయి. ఏఐసీపీఐ ఐడబ్ల్యూ డేటా ప్రకారం లేబర్ బ్యూరో రిలీజ్ చేసిన డేటా ప్రకారం సిమ్లాలో డీఏను ఆ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అలాగే.. కేంద్రం నుంచి కూడా డీఏ పెంపుపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అంతకంటే ముందు.. ఏ రాష్ట్రాల్లో ఆగస్టులో డీఏను పెంచారో తెలుసుకుందాం.
7th Pay Commission : ఛత్తీస్ గఢ్ లో 6 శాతం పెరిగిన డీఏ
ఆగస్టు 16, 2022 న ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం డీఏను 6 శాతం నుంచి 28 శాతానికి పెంచింది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం డీఏను పెంచింది. ఆరో వేతన సంఘం కమిషన్ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం డీఏను 15 శాతానికి పెంచింది. ఆగస్టు 1, 2022 నుంచి రాష్ట్ర ప్రభుత్వం డీఏ పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. డీఏ, డీఆర్ పెంపును గుజరాత్ ప్రభుత్వం 3 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకే గుజరాత్ ప్రభుత్వం కూడా డీఏను పెంచింది.
15 ఆగస్టు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ డీఏ పెంపుపై ప్రకటన వెలువరించారు. డీఏ పెంపు వల్ల 9.38 లక్షల గుజరాత్ ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయత్ సర్వీస్, పెన్షనర్లకు డీఏ పెరగనుంది. జనవరి 1, 2022 నుంచి గుజరాత్ ఉద్యోగులకు డీఏ పెంపు వర్తించనుంది. మహారాష్ట్ర కూడా డీఏను 3 శాతం పెంచింది. మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 34 శాతానికి పెంచారు. అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏతో సమానం. తమిళనాడులోనూ ఆ ప్రభుత్వం 34 శాతానికి డీఏను పెంచింది. ఇటీవల డీఏ, డీఆర్ ను 3 శాతం పెంచింది. 1, జులై 2022 నుంచి తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు వర్తించనుంది.