Super Over : నాలుగేళ్ల తర్వాత సూపర్ ఓవర్.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఎవరు విన్ అయ్యారు..!
ప్రధానాంశాలు:
Super Over : నాలుగేళ్ల తర్వాత సూపర్ ఓవర్.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఎవరు విన్ అయ్యారు..!
Super Over : ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించింది. గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులు చేయగా, రాజస్థాన్ కూడా 188 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో సూపర్ ఓవర్ జరిగింది. సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ 11 పరుగులు చేసింది, ఢిల్లీ నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని సాధించి ఐపీఎల్ లో ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని పాయింట్లపట్టికలో టాప్‌కి వెళ్లింది.

Super Over : నాలుగేళ్ల తర్వాత సూపర్ ఓవర్.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఎవరు విన్ అయ్యారు..!
Super Over టఫ్ ఫైట్..
సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ విజేతను నిర్ణయించడం అనేది నాలుగేళ్ల అనంతరం ఇదే తొలిసారి. రాజస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ తో పాటు సూపర్ ఓవర్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీకి సూపర్ విక్టరీని అందించాడు మిచెల్ స్టార్క్. మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
రాజస్థాన్ రాయల్స్ కు 189 పరుగుల లక్ష్యాన్ని ముందు ఉంచింది ఢిల్లీ. ఓపెనర్ అభిషేక్ పోరెల్ 37 బంతుల్లో 49 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ జట్టు తరపున అభిషేక్ పోరెల్ తో పాటు కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్(34), ట్రిస్టన్ స్టబ్స్(34*), అశుతోష్ శర్మ(15*) రాణించారు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు సంజూ శాంసన్(31 రిటైర్డ్ హర్ట్), యశస్వి జైస్వాల్(51) మంచి ఆరంభాన్ని అందించిన ఆతర్వాత వచ్చి రియాన్ పరాగ్(8) అంతగా రాణించలేకపోయాడు. అనంతరం వచ్చిన నితీష్ రాణా(51) హాఫ్ సెంచరీతో అద్భుతంగా రాణించాడు. నితీష్ రాణా తర్వాత ధ్రువ్ జురెల్(26) చివరి వరకు క్రీజులో నిలిచి రాజస్థాన్ ను గెలిపించేందుకు ప్రయత్నించిన సాధ్యం కాలేదు.