Degree Student : ఒక్క ఉద్యోగం రాక చస్తుంటే .. ఈ అమ్మాయికి ఏకంగా ఐదు టాప్ కంపెనీలో ఉద్యోగాలు ఎలా వచ్చాయో ..??
Degree Student : ఒకప్పుడు నిరక్షరాస్యత ఎక్కువ ఉండడంతో చదివిన చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో టఫ్ కాంపిటీషన్ ఏర్పడింది. ఒక్క ఉద్యోగం సంపాదించడమే పెద్ద ఘనకార్యం అయిపోయింది. ఎంత పెద్ద చదువు చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. మరికొందరు దొరికిన జాబ్ తో అడ్జస్ట్ అయిపోతున్నారు. అయితే ఈ అమ్మాయి మాత్రం ఏకంగా ఐదు ఉద్యోగాలను సంపాదించింది. అది కూడా ఒకే […]
Degree Student : ఒకప్పుడు నిరక్షరాస్యత ఎక్కువ ఉండడంతో చదివిన చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో టఫ్ కాంపిటీషన్ ఏర్పడింది. ఒక్క ఉద్యోగం సంపాదించడమే పెద్ద ఘనకార్యం అయిపోయింది. ఎంత పెద్ద చదువు చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. మరికొందరు దొరికిన జాబ్ తో అడ్జస్ట్ అయిపోతున్నారు. అయితే ఈ అమ్మాయి మాత్రం ఏకంగా ఐదు ఉద్యోగాలను సంపాదించింది. అది కూడా ఒకే టైంలో. కాలేజీలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒకేసారి ఐదు కంపెనీలకు అప్లై చేయగా అన్ని కంపెనీలు జాబ్ ఆఫర్ చేశాయి.
విశాఖపట్నం గాజువాక ప్రాంతానికి చెందిన సాయి వర్షిని ఈ అరుదైన ఘనత సాధించింది. ఆమె తండ్రి ఆనంద్ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్లో సిబిఐ కోర్టులో పనిచేస్తున్నారు. తల్లి పార్వతి రైల్వేలో పనిచేస్తున్నారు. వీరి మొదటి కుమార్తె సాయి వర్షిని పదో తరగతి వరకు బేతని పాఠశాలలో చదివింది. ఆ తర్వాత ఇంటర్ ఆదిత్య డిగ్రీ కాలేజీలో చదివింది. తర్వాత వర్షిణి డిగ్రీ కాలేజీలో ఎంసీసీఎస్ గ్రూప్ ను ఎంచుకుంది. ఫైనల్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు సాధించి క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళింది. కంప్యూటర్ సైన్స్ బ్యాక్ గ్రౌండ్ తో ఐదు కంపెనీల ఇంటర్వ్యూ హాజరైంది. ఈ కంపెనీలన్ని టాప్ కంపెనీలే కావడం విశేషం.
వీటిలో ఇంటెల్ కంపెనీ చేయడానికి 7.25 లక్షలు ప్యాకేజీ ఆఫర్ చేయగా, విప్రో కంపెనీ 2.05 లక్షలు ఆఫర్ చేసింది. ఐదు కంపెనీల ఆఫర్లు ఇంటెల్ ఆఫర్ నచ్చడంతో ఆమె ఈ కంపెనీలో చేరనుంది. ఈ విజయం వెనక తనకు పాఠాలు నేర్పిన కాలేజీ లెక్చరర్స్, తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులు కారణమని ఆమె తెలిపింది. కూతురికి ఉద్యోగం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటగా సాయి వర్షిణి ఆమె తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదవమని పట్టుబట్టారు. కానీ ఆమె మాత్రం డిగ్రీ కాలేజీలో చేరారు. డిగ్రీ చదువు తక్కువ అని ఫీల్ అయ్యే వారికి వర్షిని సక్సెస్ నిదర్శనం అని చెప్పాలి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఆమె నిరూపించింది.