Chicken Curry : దాబా స్టైల్ లో ఇలా చికెన్ వండారంటే.. లొట్టలేసుకుంటూ తింటారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chicken Curry : దాబా స్టైల్ లో ఇలా చికెన్ వండారంటే.. లొట్టలేసుకుంటూ తింటారు

 Authored By pavan | The Telugu News | Updated on :26 May 2022,2:30 pm

Chicken Curry : చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చాలా మంది ఫేవరెట్ ఫుడ్ ఐటెం కూడా. సండే వచ్చిందంటే చాలూ చికెన్ ఉండాల్సిందే. వేడి వేడి కొద్దిగా కారంగా ఉండే చికెన్ కర్రీ అయితే లొట్టలేసుకుంటూ తింటారు చాలా మంది. నాన్ వెజ్ లలో ఎక్కువగా తినేది చికెన్ నే. మటన్, ఫిష్ లాంటివి కూడా తిన్నప్పటికీ చాలా మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం చికెన్ మాత్రమే. అందుబాటులో ఉండే ధరకే చికెన్ దొరుకుతుంది. చాలా మంది చికెన్ తినేందుకు ఇది కూడా ఒక కారణం.చికెన్ తో చాలా వెరైటీ వంటకాలు చేయవచ్చు. బిర్యానీ నుంచి పులావ్, చికెన్ ఫ్రై, చికెన్ పులుసు, చికెన్ 65, చికెన్ మంచూరియా, గ్రిల్ చికెన్, చికెన్ కబాబ్ ఇలా చెప్పుకుంటూ పోతే చికెన్ తో చేసే వంటకాల సంఖ్య ఎంతకీ తరగదు. ఏ ఇతర ఆహార పదార్థాలతోనూ చేయలేనన్ని వేరైటీస్ ను చికెన్ తో చేస్తారు.

అయితే ఎక్కువ మంది చేసేది, ఎక్కువ మందికి నచ్చేది చికెన్ గ్రేవీ కర్రీ. దీనిని ఇంట్లో చాలా సులువుగా చేసుకోవచ్చు. చపాతీ, పూరీల్లోకి చికెన్ గ్రేవీ కర్రీ తినడానికి చాలా బాగుంటుంది. అయితే ఎప్పుడూ ఒకే మాదిరిగానా అనే అడిగే వారి కోసం ఇప్పుడు కొత్తగా ట్రై చేద్దాం.అచ్చం దాబాలో చేసినట్లుగానే చికెన్ కర్రీ చేసుకోవాలంటే ఇలా ప్రయత్నించండి. చాలా రుచిగా ఉంటుంది. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. దాబా స్టైల్ లో చికెన్ కర్రీ వండుకునేందుకు ఏమేం పదార్థాలు కావాలో ముందు తెలుసుకుందాం. చికెన్- అర కిలో, పసుపు- ఒక టీ స్పూన్, ఉప్పు-తగినంత, నూనె- 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు ఒకటి, 2 యాలకులు, లవంగాలు-3, ఒక ఇంచ్ దాల్చిన చెక్క, తరిగిన పచ్చి మిర్చి-3, ఉల్లి పాయ పేస్టు- అర కప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు.

dhaba style chicken curry very delicious here it is the recipe

dhaba style chicken curry very delicious here it is the recipe

టమాట ప్యూరీ- ఒక కప్పు, కారం- ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి- పావు టీ స్పూన్, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా, కరివేపాకు ఒక రెబ్బ, కొద్దిగా కొత్తి మీర.చికెన్ లో పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నూనెలో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, పచ్చి మిర్చి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించుకోవాలి. తర్వాత టమాటా ప్యూరీ వేసి నూనె పైకి తేలే వరకు ఉంచాలి. తర్వాత అరగంట పాటు పక్క నుంచి చికెన్ వేసుకోవాలి. పెరుగు, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. 15 నిమిషాల తర్వాత నీళ్లు పోసుకుని బాగా ఉడికిన తర్వాత దించేసుకోవాలి. అంతే దాబా స్టైల్ రుచిగా ఉండే చికెన్ కర్రీ రెడీ.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది