Amith shah – Jr NTR : మోడీ కలవమంటేనే అమిత్ షా ఎన్టీఆర్ ని కలిశాడా ? ఇంత స్కెచ్ ఉందా ?
Amith shah – Jr NTR : బీజేపీ అగ్ర నేత అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడిని పెంచింది. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ నటనకు ప్రశంసించడానికే ఈ భేటీ జరిగిందని చెప్తున్నా దీని వెనుక బీజేపీ దీర్గకాలిక వ్యూహం ఉందంటున్నారు. జూనియర్ ను బీజేపీ భవిష్యత్ లో రాజకీయంగా ఉపయోగించుకోవడానికే ఈ భేటీ జరిగిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే ఈ భేటీకి ప్రధాని మోడీ నుంచి సూచనలు వచ్చినట్లు కూడా చెబుతున్నాసరు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో.. టీడీపీ, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి కనిపించిందనే చెప్పాలి. ఈ భేటీపై ఇప్పటికే రకరకాల కథనాలు వచ్చాయి. ఇక అమిత్ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ నటనకు ప్రశంసిస్తూ పోస్ట్ చేయడంతో అనుమానాలు మొదలయ్యాయి. అయితే బీజేపీకి తెలంగాణలో జూనియర్ ను దింపే అవసరం పెద్దగా లేకపోవచ్చు.
Amith shah – Jr NTR : టీడీపీ భవిష్యత్ నాయకత్వంపై.. ఆలోచించి..!
కానీ భవిష్యత్ లో ఏపీలో బీజేపీ బలపడటానికి జూనియర్ ఎన్టీఆర్ ముందుంచే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో టీడీపీ ప్రస్తుతం బలంగా ఉన్నా భవిష్యత్ లో ఆ పార్టీ నాయకత్వంపై సందేహాలైతే ఉన్నాయి. చంద్రబాబు తర్వాత నారా లోకేష్ తప్ప ఎవరికీ ఛాన్స్ ఉండదన్న విషయం తెలిసిందే. కానీ లోకేష్ ఇంకా రాజకీయాల్లో రాటు దేలలేదన్నది వాస్తవం. చంద్రబాబు వంటి రాజకీయ చతురత ప్రదర్శించగల నేతగా ఎదగలేకపోయారని అంటున్నారు. మరి భవిష‌్యత్ లో ఆయన తండ్రిమాదిరిగా వ్యూహాలను రచించడంలో దిట్ట అవుతారామో చెప్పలేం కానీ.. ప్రస్తుతానికి లోకేష్ నాయకత్వాన్ని సమర్థించేవారు లేరనేది వాస్తవం.
Amith shah – Jr NTR : అందుకే ఎన్టీఆర్ తో భేటీ..!
అలాగే బాలకృష్ణ ఉన్నా ఆయన ఫుల్ టైం రాజకీయ నేతకాదనే చెప్పాలి. అయితే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు అంతా కోరుకునే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్.. చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా జూనియర్ ఫ్లెక్సీలే కనిపిస్తుండటం తెలిసిందే. పార్టీ అభిమానులు, కింది స్థాయి క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీలకంగా మారాలని భావిస్తున్నారు. కానీ జూనియర్ మాత్రం తనకు ఇప్పుడే రాజకీయాల్లో రావాలని ఆలోచన చేయడం లేదని చెబుతూ వస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా బీజేపీ అప్రమత్తమయినట్లు కనపడుతోంది. జూనియర్ కు టీడీపీ నాయకత్వం అప్పగిస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకోవచ్చు. జూనియర్ ని టీడీపీ దూరం పెడితే తాము దగ్గరకు తీయాలన్న లక్ష్యంతో ఒక చిన్న పాటి ప్రయత్నం చేసినట్లు కనపడుతుంది.
ఇక జూనియర్ ఎన్టీఆర్ అత్త, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి బీజేపీలో క్రియాశీలంకగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కూడా అప్పగించాలన్న యోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును, ఆయన పార్టీని ఏపీలో డల్ చేయగలిగితే బీజేపీ పుంజుకునే అవకాశాలున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మద్దతిస్తే బీజేపీలో చేరికలు కూడా భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇవన్ని లెక్కలు వేసే మోడీ షాలు జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారంటున్నారు. మరి బీజేపీ వ్యూహం ఫలిస్తుందా.. లేదా అన్నది చూడాలి.