Ys Jagan Vs Bjp : జగన్ తో జగడానికి.. కాలు దువ్వుతున్న కమలనాథులు..?
Ys Jagan Vs Bjp : ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైఎస్సార్సీపీకి, కేంద్రంలోని రూలింగ్ పార్టీ బీజేపీకి మధ్య ఇకపై ప్రత్యక్ష రాజకీయ పోరాటానికి తెర లేవనుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి Ys jagan పట్ల ఇన్నాళ్లూ చూసీచూడనట్లు వ్యవహరించిన కాషాయం పార్టీ ఇకపై కఠినంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఏపీ బీజేపీకి హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు. కరోనా టీకాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ మిగతా రాష్ట్రాల సీఎంలందరినీ ఏకతాటి మీదికి తేవటానికి లేఖలు రాయటం దీనికి ఒక కారణం. ఈ నేపథ్యంలో జగన్ ని పొలిటికల్ గా టార్గెట్ చేయాలని, తద్వారా అతణ్ని మళ్లీ తమ దారికి తెచ్చుకోవాలని బీజేపీ భావిస్తోంది.
వేరే ఛాయిస్ లేదు..
అఫ్ కోర్స్.. జగన్ Ys jagan కి కేంద్రంలో బీజేపీతో స్నేహం చేయకతప్పని పరిస్థితి. కాంగ్రెస్ కూటమిలోకి ఎలాగూ పోడు. థర్డ్ ఫ్రంట్ అనేది అసలు సోయిలోనే లేదు. అందువల్ల రాజకీయంగా ఎంత ఒత్తిడి తెచ్చినా అతనికి వేరే గతిలేదు కాబట్టి తమతోనే కలిసి నడుస్తాడని భావిస్తోంది. కాదు కూడదు అని తోక జాడిస్తే దాన్ని బెయిల్ రద్దు ద్వారా కట్ చేయనున్నట్లు పరోక్షంగా వార్నింగులు ఇస్తోంది. ఏపీలోని ఆలయాలపై దాడుల సమయంలోనే జగన్ దూకుడుకి చెక్ పెట్టాలని చూసింది. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఉన్నందున కావాలనే కాస్త వెనక్కి తగ్గింది. అయినప్పటికీ జగన్ లో మార్పు రాకపోవటంతో మునుపటి మాదిరిగా సాఫ్ట్ గా ఉంటే నడవదనే అవగాహనకు వచ్చింది.
ఆ ఎంపీని ముందు పెట్టి..: Ys Jagan Vs Bjp
జగన్ ని తమకు అనుకూలంగా మలచుకోవటానికి ఇన్నాళ్లూ వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు ద్వారా ప్రయత్నాలు చేసిన కమలనాథులు ఇకపై తామే ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలని ప్రణాళికలు రచిస్తున్నారు. సర్కారుపై పదునైన ఆరోపణలు చేస్తున్నారు. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మాదిరిగా కాకుండా ప్రస్తుత ప్రెసిడెంట్ సోము వీర్రాజు ద్వారా సీరియస్ గా పొలిటికల్ ఫైట్ చేయాలంటూ పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. జగన్ కే బీజేపీతో అవసరం తప్ప బీజేపీకి జగన్ Ys jagan తో అవసరంలేదని అంటున్నారు. మొత్తమ్మీద ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ పాత్రను కాషాయం పార్టీ పోషించాలని ఉత్సాహంగా ఉన్నట్లు అర్థమవుతోంది. గతంలో పార్లమెంట్ లో తాము అడిగినా అడక్కపోయినా సపోర్ట్ చేసిన జగన్ మళ్లీ అదే మోడ్ లోకి, మూడ్ లోకి వచ్చేలా చేయాలని ఆశిస్తోంది.