చంద్రబాబుకు భారీ షాక్.. పార్టీ మారనున్న టీడీపీ అధ్యక్షుడు..!
చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు మూలిగె నక్కపై తాటిపండు పడినట్టుగా ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతున్న పరిస్థితుల్లో బాబు మరో గట్టి షాక్ తగలనుంది. ఏకంగా టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీ మారున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. రమణ l Ramana టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం అయినట్లు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రమణను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం . అయితే టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరగానే అతనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి సీఎం కేసీఆర్ సముచితంగా ఉన్నట్లు సమాచారం.
ఎల్. రమణకు l Ramana ఎమ్మెల్సీ ఖాయం
అయితే ఎల్. రమణ l Ramana వరంగల్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా టీడీపీ నుంచి వచ్చి టీఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవి చేపట్టారు. అయితే వీరి పాత సాన్నిహిత్యంతో ఎల్. రమణ.. ఎర్రబెల్లి దయాకర్ రావుతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం తెలుస్తుంది. అయితే ఈటెల రాజేందర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన బీసీ నాయకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.
అయితే ఈటెల రాజీనామాతో ఆ ఖాళీని మరో బీసీ నాయకుడు ఎల్. రమణతో భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రమణ l Ramana తో పాటు మరి కొందరు టీడీపీ నాయకులు కూడా టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ నెల 3 తేదీన ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఎల్.రమణకు ఇచ్చేందుకు కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రమణ టీడీపీ పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు. రాష్ట్ర వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మొత్తం ఖాళీ అయింది. ఆ తర్వాత టీడీపీ అధ్యక్షడు ఎల్.రమణ పార్టీని బలోపేతం చేయడానికి ఎన్నో ప్రయత్నాడు చేసాడు కానీ ఫలితం లేకుండా పోయింది. తెలంగాణలో వచ్చిన ఏ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలవుతుంది. ఈ స్థితిలో ఎల్.రమణ l Ramana తన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దమైనట్లు సమాచారం.