Roja : త్వరలో మంత్రి అవుతున్న రోజా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja : త్వరలో మంత్రి అవుతున్న రోజా

 Authored By kondalrao | The Telugu News | Updated on :7 June 2021,1:05 pm

Roja : ఆర్కే రోజా మనకు ఇప్పటివరకు ఒక సినిమా నటిగా, జబర్దస్త్ జడ్జిగా, ‘రచ్చబండ’ తీర్పరిగా, ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా తెలుసు. అయితే ఆమెను ఇకపై మంత్రిగా కూడా చూడబోతున్నాం. కాకపోతే అది రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించటంతో చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి శాసన సభ్యురాలిగా నెగ్గిన రోజాకి వైఎస్ జగన్ కేబినెట్ లో చోటు ఖాయం అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో ఆమె కొంత నిరుత్సాహానికి గురైన మాట వాస్తవం. ఈ నేపథ్యంలో రోజాకి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ) చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. ఫలితంగా ఆమె కొంత శాటిస్ ఫై అయ్యారు. అయితే సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించినప్పుడు రోజాకి కూడా మినిస్టర్ గా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. కానీ అంతకన్నా ముందే ఆమె మంత్రిగా ఒక మూవీలో మెరవనున్నారు.

roja mla roja will be in minister role

roja-mla-roja-will-be-in-minister-role

అల్లు వారి చిత్రంలో..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తొలిసారి రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న పుష్ప మూవీలో రోజా ఈ క్యారెక్టర్ పోషించనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం ఈ ఏడాది ఆగస్టులో, రెండో భాగం వచ్చే ఏడాది విడుదలవుతుందని చెబుతున్నారు. మరి, రోజా ‘పుష్ప వన్’లో ఈ పాత్ర పోషిస్తారో ‘పుష్ప టూ’లో కనిపిస్తారో క్లారిటీ లేదు. మరో రెండు నెలలు ఆగితే ఆగస్టు 13న రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్న ‘పుష్ప వన్’తో తేలిపోనుంది. కరోనా లాక్డౌన్ కారణంగా ఈ పిక్చర్ షూటింగ్ ప్రస్తుతానికి నిలిచిపోయింది.

అవలీలగా.. ఆసక్తికరంగా..: Roja

సినిమా ఫీల్డ్ తోపాటు రాజకీయ రంగంలోనూ సీనియర్ అయిన రోజా.. మినిస్టర్ రోల్ లో ఈజీగా ఒదిగిపోతారనిపిస్తోంది. హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటికే మెప్పించిన ఆమె ఈ పాత్రను సైతం రక్తి కట్టిస్తారని ఫ్యాన్స్ సంతోషంగా చెబుతున్నారు. నగరి సెగ్మెంట్ లోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రోజా రాజకీయ అభిమానులు కూడా ఆమెను మంత్రిగా చూడాలని ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. రేప్పొద్దున నిజ జీవితంలోనూ రోజా ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ‘పుష్ప’లో శక్తిమంతమైన విలన్ గా ఫహాద్ ఫాజిల్, హీరోయిన్ గా అందాల తార రష్మిక మంధాన నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చ‌ద‌వండి ==> Jr.NTR : కుప్పంలో బాబుకు షాక్.. జూ.ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు అంటూ..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan : వైఎస్ జ‌గ‌న్‌ వాళ్ల‌కి బంగారం లాంటి ఛాన్స్ ఇచ్చినా..!

ఇది కూడా చ‌ద‌వండి ==> YSRCP : నక్క తోక తొక్కి వచ్చాడా.. వైసీపీలో ఆ సీనియర్ నేతకు పట్టిందల్లా బంగారమే?

ఇది కూడా చ‌ద‌వండి ==>b వైర‌ల్ వీడియో .. మాట్లాడుతున్న వింత పాము..!

Advertisement
WhatsApp Group Join Now

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది