YSRCP : వైసీపీ ఉరవకొండలో ఆ వర్గాన్ని అరవకుండా చేయలేరా వైఎస్ జ‌గ‌న్‌..?

0
Advertisement

YSRCP : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం అధికార పార్టీ వైఎస్సార్సీపీకి మింగుడుపడటం లేదు. అక్కడ ఈ పార్టీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి 2019 శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్యాండేట్ పయ్యావుల కేశవ్ చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ రాష్ట్రంలో రూలింగ్ పార్టీ కావటంతో ఆయన హవానే నడుస్తోందంటున్నారు. ఎమ్మెల్యేగా మరోసారి గెలవకపోయినా ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధి పైన విశ్వేశ్వర్ రెడ్డి పైచేయి సాధిస్తున్నాడని చెబుతున్నారు. ముఖ్యమంత్రి మనోడే అనే ధైర్యంతో అధికారుల దగ్గర ఈ మాజీ ఎమ్మెల్యేనే పలుకుబడి ప్రదర్శిస్తున్నాడని పేర్కొంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఈ దూకుడు స్వభావం వల్ల సొంత పార్టీ నేతలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవటంలో విశ్వేశ్వర్ రెడ్డి విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అతని కొడుకు ప్రణయ్ రెడ్డి ప్రతిచోటా డామినేషన్ చేయాలని చూడటం ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డికి చిర్రెత్తుకొచ్చేలా చేస్తోందని టాక్.

ఎన్నిసార్లు చెప్పినా..

ఏదైనా పాలిటికల్ పార్టీకి పవర్ రావటం వల్ల కొన్ని అవలక్షణాలు కూడా వంటబడతాయి. అందులో ముఖ్యమైంది ఆధిపత్య ధోరణి. అదే ఇప్పుడు ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి కొరుకుడు పడటం లేదు. విశ్వేశ్వర్ రెడ్డి, శివరామిరెడ్డిల గ్రూపు రాజకీయాలు జగన్ పార్టీకి ఒక జడపదార్థంలా తయారయ్యాయి.

Group politics in uravakonda ysrcp
Group politics in uravakonda ysrcp

అపొజిషన్ పార్టీ తెలుగుదేశానికి అనుకూలంగా మారుతున్నాయి. పోటీ పాలిటిక్స్ వద్దు అని పార్టీ పెద్దలు ఎన్నిసార్లు చెప్పినా వీళ్లు వినిపించుకోవట్లేదు. అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట అయినప్పటికీ మెజారిటీ స్థానాలను వైఎస్సార్సీపీయే తన ఖాతాలో వేసుకోగలిగింది. హిందూపురం, ఉరవకొండ మాత్రం దక్కలేదు. ఏపీ మొత్తం జగన్ పార్టీ గాలి వీచినా ఉరవకొండలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి విక్టరీ సాధించకపోవటానికి ఈ కుమ్ములాటలు కూడా ఒక కారణం కావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇకనైనా.. దారిన పడేనా..: YSRCP

వైఎస్సార్సీపీ హైకమాండ్ ఎన్నిసార్లు పంచాయతీ పెట్టి క్లాస్ తీసుకుంటున్నా ఈ రెండు వర్గాలు మాత్రం దారికి రావట్లేదు. ఎప్పటికప్పుడు కొత్త గొడవలతో పరిస్థితిని మళ్లీ మొదటికి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం మరోసారి వీళ్లను తాడేపల్లికి పిలిపించినట్లు తెలుస్తోంది. ఈసారైనా ఈ రెండు గ్రూపులు ఒక్కటవుతాయా అని అనుకుంటున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు ప్రణయ్ ఒంటెత్తు పొకడలకు ముకుతాడు పడుతుందని ఆశిస్తున్నారు. అధికారం అండతో ప్రజాసేవలో మరింతగా నిమగ్నం కావాల్సిన లీడర్లు తమలోతామే కీచులాడుకోకుండా ఉంటే అంతే చాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan : వైఎస్ జగన్ ఫ్యామిలీపై.. విపక్షాల వింత, విచిత్ర అంచనాలు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> చంద్ర‌బాబుకు భారీ షాక్‌.. పార్టీ మార‌నున్న టీడీపీ అధ్య‌క్షుడు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Roja : త్వరలో మంత్రి అవుతున్న రోజా

ఇది కూడా చ‌ద‌వండి ==> Ap Politics : నాయుడు గారి కుటుంబానికి.. ఏపీ రాజకీయాల్లో ఎండ్ కార్డే(నా)..?

Advertisement