Children : ఈ విధంగా చేసి… పిల్లల నుండి ఫోన్ వ్యసనాన్ని చెక్ పెట్టవచ్చు…
Children : ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చిన్న వయసు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఫోన్ కి బానిసగా మారిపోయారు. ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఈ ఫోన్లను దూరం చేయడానికి వారి అమ్మానాన్న ఎన్నో తంటాలు పడుతుంటారు. పిల్లలు చదవాలన్న, తినాలన్న, ఏది చేయాలన్న ఈ ఫోన్ కావాలి అంటూ ఎంతో గొడవ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఫోన్ వలన పిల్లలు కు కంటి చూపు తగ్గిపోవడం, మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, నిద్ర వంటి చదువు లాంటి వాటిపై ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుందని కొందరు సైకాలస్టులు అంటున్నారు. ఈ అలవాటుని ఈ టిప్స్ తో దూరం చేయొచ్చు…
దుష్ప్రభావాల సంబంధించి పిల్లలకు తెలియజేయాలి. పిల్లలు ఫోన్లు పట్టుకున్న ప్రతిసారి పిల్లల నుంచి ఆ ఫోను తీసేయడానికి బదులు.. ఫోన్ ఎక్కువ సమయం వాడడం వలన కలిగే నష్టాల గురించి పిల్లలకి తెలియజేయాలి. దానిని పిల్లలు స్వీకరించేలా చెప్పాలి. పిల్లలకు అర్థమయ్యేలా తెలియజేయాలి. ఈ విధంగా వారిలో కొంత మార్పు వస్తుంది. వారికి స్మార్ట్ ఫోన్ ను అందుబాటులో ఉంచవద్దు.. పిల్లలు పడుకునే రూమ్లో స్మార్ట్ ఫోన్లు ఉంచవద్దు. వారు నిద్రించే సమయంలో వారికి దానిని అందుబాటులో ఉన్నట్లయితే అది వారి ఎదుగుదలకు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. రాత్రి అయిన తర్వాత పిల్లలు ఫోన్ స్క్రీన్ లవైపు ఎక్కువ సమయం చూడడం ఆపాలి. పిల్లలకి ఫోన్ వాడుకునే సమయాన్ని సెట్ చేయండి. 18 నెలల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి ఫోన్ చూడకుండా జాగ్రత్త పడాలి.
అలాగే 18 నుంచి 24 సంవత్సరాల వయసు పిల్లలకి తల్లిదండ్రులకు పర్యవేక్షణలో నాలెడ్జ్ ని పెంచే బొమ్మలు లాంటివి చూసేలా చేస్తే మంచిది. రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలలోపు వయసు ఉన్న పిల్లలకి రోజు గంటకి మించి ఫోన్ చూడనివ్వద్దు. పిల్లలని రోల్ మోడల్ గా మార్చండి. పిల్లలకి ఫోన్లు వాడకుండా కొన్ని కఠినమైన చర్యలను పాటించాలని మీరు ఫోన్ తీసుకునే ముందు ఒక రోల్ మోడల్ గా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. అని పిల్లలకి చెప్పాలి. పిల్లలు విన్నదానికంటే వారు చూసేదాన్ని తొందరగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు వారు చూసే సమయంలో గంటల గంటలు స్మార్ట్ ఫోన్లు తల్లిదండ్రులు వాడకుండా ఉండాలి. తల్లి తండ్రిని చూసి పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మీరు ఎంత తక్కువ వాడితే అంత మంచిది.