Facial Fact | వయసుతో పాటు ముఖంపై కొవ్వు పెరుగుతుందా?.. అయితే ఇలా తగ్గించుకోండి
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్ చిన్ వస్తుంది. ముఖం ఆకృతి మారిపోవడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది.దీనిని వదిలించుకోవడానికి ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడిపోతుంటారు. ఇది ముఖం ఆకృతిని కూడా మార్చుతుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు ముఖాన్ని స్లిమ్ గా చేసుకోవడానికి వీలైనన్ని ఎక్కువ ముఖ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. కొన్ని సులభమైన ఇంటి వ్యాయామాలతోనే ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

#image_title
ముఖం స్లిమ్‌గా మార్చే వ్యాయామాలు
దవడ వ్యాయామం: దవడను ముందుకు తోసి 2 సెకన్లు అలాగే ఉంచాలి. రోజుకు కనీసం 10 సార్లు చేయడం ద్వారా ముఖంపై ఉన్న అదనపు కొవ్వు క్రమంగా తగ్గుతుంది.
చూయింగ్ గమ్ అలవాటు: ప్రత్యేకంగా వ్యాయామానికి సమయం లేకపోతే, చూయింగ్ గమ్ నమలడం ద్వారా కూడా ముఖ కండరాలు కదిలి కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది.
అదనపు ప్రయోజనాలు
ఈ వ్యాయామాలు చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఫలితంగా ముఖం స్లిమ్‌గా, యవ్వనంగా కనిపిస్తుంది. మొత్తంగా, క్రమం తప్పకుండా చిన్నచిన్న ముఖ వ్యాయామాలు చేయడం ద్వారా ముఖం మీద పెరిగే కొవ్వును నియంత్రించుకోవచ్చు.