YS Jagan : వైఎస్ జగన్ చేస్తున్నదే రైటు.! విద్యార్థుల ఇంగ్లీషు నైపుణ్యం భేష్.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : వైఎస్ జగన్ చేస్తున్నదే రైటు.! విద్యార్థుల ఇంగ్లీషు నైపుణ్యం భేష్.!

 Authored By prabhas | The Telugu News | Updated on :19 May 2022,9:00 pm

YS Jagan : తెలుగు భాషకు అన్యాయం జరిగిపోతోందన్న ప్రచారంలో ఎంత వరకు నిజం.? ఈ రోజుల్లో విద్యార్థులు తెలుగు నేర్చుకునేందుకు, తెలుగులో మాట్లాడేందుకు ఇష్టపడుతున్నారా.? గడచిన రెండు దశాబ్దాల్లో విద్యా రంగంలో చాలా చాలా మార్పులొచ్చాయి. ప్రపంచం కుగ్రామం అయిపోయిన దరిమిలా, ఇంగ్లీషు అవసరం ఎక్కువైపోయింది. ఎక్కడికెళ్ళినా ఇంగ్లీష్ తప్పనిసరి. దాంతో, విద్యార్థులు ఒకటో తరగతి నుంచే ఇంగ్లీషు వైపు మొగ్గు చూపాల్సి వస్తోంది. ఎల్కేజీ చదువుల దగ్గర్నుంచే ఇంగ్లీషు తప్పనిసరిగా మారింది.ప్రైవేటు స్కూళ్ళలోనే ఇంగ్లీషు మీడియం అటే ఎలా.? సర్కారీ బడుల్లో కూడా ఆ ఇంగ్లీషు మీడియం వస్తే ఎలా వుంటుందన్న ఆలోచన చాలాకాలం క్రిందటే జరిగింది.

ప్రయోగాత్మకంగా ఆ నిర్ణయాన్ని అమలు చేసినా, తెలుగు మీడియం ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీషు పెద్ద సమస్యగా మారింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, తెలుగు మీడియంని తొలగించి.. పూర్తిగా ఇంగ్లీషు మీడియంని సర్కారీ స్కూళ్ళలో ప్రవేశపెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు.
తెలుగు మీడియంని తొలగించడం.. అనే మాట వినడానికి ఒకింద బాధగా కొందరికి అనిపించొచ్చు. కానీ, ప్రస్తుత సమాజ అవసరాలు, విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటే.. అది అనివార్యం. రాజకీయంగా ఈ నిర్ణయానికి చాలా వ్యతిరేకత ఎదురయ్యింది. నానా రకాల వివాదాల నడుమ, తెలుగు మీడియంని కొనసాగిస్తూ, ఇంగ్లీషు మీడియం.. అనే నిర్ణయం తీసుకుంది జగన్ సర్కారు.

English Medium YS Jagan Right Way

English Medium, YS Jagan Right Way

అయితే, విద్యార్థులు తమకు అందుబాటులో వున్న సర్కారీ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియం చదివేందుకు ఉత్సాహం చూపడమే కాదు, ఆ ఇంగ్లీషు మీడియంని బాగా వంటబట్టించేసుకున్నారు. అచ్చం విదేశీయుల్లా ఇంగ్లీషులో అనర్గలంగా మాట్లాడటం నేర్చుకున్నారు. అలాంటి విద్యార్థుల్లో కొందరు, ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఒకరు క్రికెట్ కామెంటేటర్ అవుతాననీ, ఇంకొకరు కలెక్టర్ అవుతాననీ ఇంగ్లీషులో చెప్పడంతో ముఖ్యమంత్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్.
తన విజన్… సత్ఫలితాలనిస్తే ఎవరికైనా ఆ ఆనందం అలానే వుంటుంది. ‘మీరు ముఖ్యమంత్రిగా వుండగానే నేను కలెక్టర్ అవుతాను..’ అని ఓ విద్యార్థి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చెప్పడం గమనించాల్సిన ప్రత్యేకమైన విషయమిక్కడ.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది