EPFO Pension : పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఈపీఎఫ్ఓ… ఇక ఈ విషయంలో రిలీఫ్ కలగనుందట…
EPFO Pension : ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ తమ రిటైర్మెంట్ వరకు ఎంతో కొంత జమ చేయాలనుకుంటారు. అలాంటి వారికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) బాగా ఉపయోగపడుతుంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్స్ చట్టం 1952లో ఈ ప్లాను ప్రవేశపెట్టారు. ఈపీఎఫ్ ను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్వహిస్తుంది. దీనివల్ల ఉద్యోగులకు మంచి ప్రయోజనం లభిస్తుంది. ఉద్యోగులు తాము ప్రతినెల తీసుకునే జీవితంలో కొంత భాగం అంటే ఆదాయంలో 12 శాతం ఈ పథకంలో […]
EPFO Pension : ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ తమ రిటైర్మెంట్ వరకు ఎంతో కొంత జమ చేయాలనుకుంటారు. అలాంటి వారికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) బాగా ఉపయోగపడుతుంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్స్ చట్టం 1952లో ఈ ప్లాను ప్రవేశపెట్టారు. ఈపీఎఫ్ ను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్వహిస్తుంది. దీనివల్ల ఉద్యోగులకు మంచి ప్రయోజనం లభిస్తుంది. ఉద్యోగులు తాము ప్రతినెల తీసుకునే జీవితంలో కొంత భాగం అంటే ఆదాయంలో 12 శాతం ఈ పథకంలో పొదుపు చేయాల్సి ఉంటుంది. ఇదే మొత్తాన్ని ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ పొదుపు చేస్తుంది. దీనికి వడ్డీ కూడా చెల్లిస్తుంటారు. రిటైర్ అయ్యే నాటికి ఉద్యోగి జమ చేసిన మొత్తం తో పాటు వడ్డీ కూడా కలిసి తిరిగి చేతికి వస్తుంది.
ఈపీఎఫ్ లో రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే దీనిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి. అయితే ఈపీఎఫ్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకుముందు ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ 1995 కిందనున్న పెన్షనర్లు ప్రతి సంవత్సరానికి ఒకసారి జీవన్ ప్రమాణం లేదా లైఫ్ సర్టిఫికెట్ను సబ్మిట్ చేయాలి. పెన్షన్ క్రెడిట్ అయ్యే బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లు చోట లైఫ్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయాలి. అంతకంటే ముందు ఉండే పెన్షనర్లు సబ్మిట్ చేసే ఏజెన్సీల వద్దకు వెళ్లి దీన్ని సబ్మిట్ చేసేవారు. అయితే ఒకవేళ దీన్ని తీసుకోలేకపోతే పెన్షనర్లకి సులువుగా చేసేందుకు లైఫ్ సర్టిఫికెట్ ప్రాసెస్ ను ఈపీఎఫ్ఓ ఈజీ చేసింది. దీనితో రిలీఫ్ కలగనుంది. పెన్షనర్లకు మొబైల్ యాప్ ని లాంచ్ చేశారు.
పూర్తి డీటెయిల్స్ ను చూస్తే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను యాప్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు. ఏ సమయంలో అయినా సరే దీన్ని సబ్మిట్ చేసేలా చేసింది. ఈ విషయం ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈపీఎఫ్ఓ తెలిపింది. ఆధార్ ఫేస్ ఆర్ డీ యాప్ ను డౌన్లోడ్ చేసి సేవలను పొందవచ్చు. బయోమెట్రిక్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఇబ్బందులు పడే పెన్షనర్లకు ఇది బాగుంటుంది. లైఫ్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేసుకోవడానికి ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి ఆధార్ ఫేస్ ఆర్ డీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఆపరేటర్ అథెంటిఫికేషన్ పై నొక్కాలి. పెన్షనర్ల అథెంటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. తర్వాత మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. తర్వాత ఫేస్ ని స్కాన్ చేసి ఎంటర్ చేయాలి. అప్రూవల్ అయితే అప్డేట్ అవుతుంది. రిజెక్ట్ అయితే ఎస్ఎంఎస్ వస్తుంది.