Pension : పింఛ‌న్ దారులకి గుడ్ న్యూస్.. ఆ క‌ష్టాల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pension : పింఛ‌న్ దారులకి గుడ్ న్యూస్.. ఆ క‌ష్టాల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా?

 Authored By ramu | The Telugu News | Updated on :16 March 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Pension : పింఛ‌న్ దారులకి గుడ్ న్యూస్.. ఆ క‌ష్టాల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా?

Pension : ఏపీలో పించన్ దారులు కొన్ని క‌ష్టాల‌ని ఫేస్ చేస్తున్నారు. ఆ క‌ష్టాల‌కి చెక్ పెట్టేలా ఏపీ ప్ర‌భుత్వం ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆధార్ ప్రాధికార సంస్ధ ఉడాయ్ తాజాగా సాఫ్ట్ వేర్ మార్చడంతో లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త‌వు. ప్ర‌భుత్వం తీసుకు్న‌న ఈ నిర్ణ‌యం వ‌ల‌న పెన్ష‌న్ ల‌బ్ధిదారుల‌కి గ‌త కొంత కాలంగా ఉన్న స‌మ‌స్య తీర‌నుంది.

Pension పింఛ‌న్ దారులకి గుడ్ న్యూస్ ఆ క‌ష్టాల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా

Pension : పింఛ‌న్ దారులకి గుడ్ న్యూస్.. ఆ క‌ష్టాల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా?

Pension క‌ష్టాలు తీరిన‌ట్టే..

రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లు పంపిణీ చేస్తుండ‌గా, ఆ స‌మ‌యంలో వృద్ధులైన లబ్దిదారులు తమ వేలి ముద్రల్ని స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా స్కానర్లపై వీరి వేలి ముద్రలు తీసుకుని పెన్షన్లు ఇస్తున్నారు. అయితే వృద్ధాప్యం కారణంగా అరిగిపోయిన వేలి ముద్రలు స్కానర్లపై పడటం లేదు. దీంతో వారికి పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు తప్పడం లేదు.

దీనికి చెక్ పెట్టేలా ప్రభుత్వం ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు పంపుతోంది. పింఛన్ల పంపిణీ చేసే సమయంలో నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్లు ఇచ్చేటప్పుడు లబ్దిదారుల వేలిముద్రలను ఈ పరికరం సహాయంతో తీసుకుంటారు. అయితే ఆధార్ సాఫ్ట్ వేర్ ను ఉడాయ్ సంస్థ అప్ డేట్ చేయంతో గతంలో ఉన్న పాత పరికరాలు పనికి రాకుండా పోయాయి. ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసిన స్కానర్లు కావడంతో ఫింగర్ ప్రింట్ సరిగా పడక సిబ్బంది, లబ్దిదారులు ఇన్నాళ్లూ ఇబ్బందులు పడ్డారు. ఇక ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది