Bandi Sanjay : బండి సంజయ్ పై తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు?
Bandi Sanjay : బండి సంజయ్… తెలంగాణ ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవాలి. ఆయన మాట్లాడితే మామూలుగా ఉండదు. రచ్చ రంబోలానే.. అధికార పార్టీ నేతలనైతే ఆయన అనని మాట లేదు. ముఖ్యంగా సీఎం కేసీఆర్, కేటీఆర్, ఇతర మంత్రులను బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శిస్తుంటారు. అయితే చాన్స్ దొరికితే… బండి సంజయ్ పై అదే రీతిలో విరుచుకుపడుతుంటారు టీఆర్ఎస్ నేతలు. ఎప్పుడూ వీళ్ల మధ్య మాటల యుద్ధాలే. ఏవైనా ఎన్నికలు వస్తే… వీళ్ల విమర్శల స్థాయి ఒక్కోసారి హద్దు మీరుతుంది. మొన్నటి వరకు నాగార్జున సాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న విషయం తెలిసిందే.
తాజాగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు… బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రస్థాయిలో ఆయనపై విరుచుకుపడ్డారు. వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా…. ఎన్నికల సమాయత్తం కోసం వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
Bandi Sanjay : బండి పోతే బండి… గుండు పోతే గుండు… అంటివి ఏమైంది బండి సంజయ్?
వరంగల్ నగరం ప్రస్తుతం ఈరేంజ్ లో అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం టీఆర్ఎస్ పార్టీ అని ఎర్రబెల్లి స్పష్టం చేవారు. సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి జరిగింది. ఇంకా అభివృద్ధి చేస్తాం. బండి సంజయ్ కి అవగాహన లేదు. అవగాహన రాహిత్యంతో ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. తప్పుడు మాటలు మాట్లాడితే వరంగల్ ప్రజలే వాళ్లకు మంచిగా బుద్ధి చెబుతారు. ఇప్పటికే అయిపోయిందేం లేదు. ఇంకో మూడు సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉండేది. ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించారు. కేవలం తాగునీటి కోసమే తెలంగాణ ప్రభుత్వం 950 కోట్లను ఖర్చు పెట్టింది. అది అభివృద్ధి కాదా? ఆ అభివృద్ధి మీకు కనిపించడం లేదా? అంటూ మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు.
వరంగల్ లో వరదలు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్లావు బండి. అప్పుడు మీకు వరదలు కనిపించలేదా? కేంద్ర ప్రభుత్వం వరదలు వస్తే రూపాయి అయినా ఇచ్చిందా? హైదరాబాద్ కు ఏం ఇచ్చింది. బండి పోతే బండి.. గుండు పోతే గుండు… అంటివి… ఎన్నెన్నో హామీలు ఇస్తివి. ఏమైంది.. ఒక్కటన్నా కేంద్రం చేసిందా? కేవలం చెప్పడానికే కానీ… చేయడానికి బీజేపీ ముందుండదు. బండి సంజయ్ మాటలను నమ్మే స్థితిలో వరంగల్ ప్రజలు లేరు. వరంగల్ రూపురేఖలే త్వరలో మారుతాయి. దాని కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రెడీగా ఉన్నారు. మీ మాయ మాటలు ఇక్కడ కాదు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్లు బీజేపీని ఎక్కడ కూర్చోబెట్టారో అందరికీ తెలుసు… తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కు ప్రకారం… ఇవ్వాల్సిన హామీలను, ఇవ్వాల్సిన వాటాను ఇవ్వండి. అదనంగా రూపాయి కూడా మాకు వద్దు… అంటూ ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.