Etela Rajender : పార్టీ పెట్టను.. వేరే పార్టీలో చేరను.. రాజీనామా చేయను.. కానీ ఆ పని మాత్రం చేస్తా..!
Etela Rajender : ప్రస్తుతం తెలంగాణలో ఒక్కటే హాట్ టాపిక్. అదే ఈటల రాజేందర్ వ్యవహారం. ఇప్పటికే ఆయన భూకబ్జా వ్యవహారంలో చిక్కుకుపోయారు. మంత్రి వర్గం నుంచి కూడా ఆయన్ను తొలగించారు. ప్రస్తుతం ఆయన వద్ద ఉన్నది ఒక్క ఎమ్మెల్యే పదవి. ఈటలను మంత్రి వర్గం నుంచి తీసేయడంతో.. ఈటల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారని.. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారని అంతా అనుకున్నారు. లేదంటే వేరే పార్టీలో అయినా చేరుతారని అనుకున్నారు కానీ.. ఈటల రాజేందర్ ప్రస్తుతం చాలా ఆలోచించి అడుగు వేస్తున్నారు. ఇప్పటికే దశాబ్దాల పాటు టీఆర్ఎస్ పార్టీతో పనిచేసి.. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా చివరకు ఆయనకు పార్టీలో ఎటువంటి గౌరవం దక్కిందో అందరం చూశాం. అందుకే.. ఆయన తొందర పడటం లేదు.

etela rajender telangana huzurabad mla trs
అయితే.. ఈటల వేరే పార్టీలో చేరకున్నా కనీసం వేరే పార్టీ అయినా పెడతారు కావచ్చు అని అంతా అనుకున్నారు కానీ.. వేరే పార్టీ లేదు.. ఏదీ లేదు. అసలు.. నేను ఏ పార్టీ పెట్టను. ఏ పార్టీలో చేరను. ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయను.. అని స్పష్టం చేశారు ఈటల రాజేందర్. ఒకవేళ తాను రాజీనామా చేస్తే.. ఎన్నికలు వస్తే ఇండిపెండెంట్ గా అయినా హుజూరాబాద్ లో బరిలోకి దిగుతానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
ప్రస్తుతానికి నేను పార్టీ పెట్టే ఆలోచన చేయలేదు. అసలు ఆ ఆలోచన కూడా నాకు ఇప్పటి వరకు రాలేదు. వేరే పార్టీలోకి కూడా పోను. వేరే పార్టీలోకి ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ పోయే ఆలోచన లేదు. నేను ఎప్పుడూ ఒంటరి కాలేదు. కాను కూడా. బావిలో నుంచి సముద్రంలో పడ్డా అంతే. నేను, హుజూరాబాద్ ప్రజలు ధర్మాన్ని, కష్టాన్ని నమ్ముకున్నాం. అందుకే.. చైతన్యానికి నిదర్శనమైన హుజూరాబాద్ ప్రజలే నన్ను మళ్లీ గెలిపిస్తారు.. అని ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Etela Rajender : పార్టీ కోసం కష్టపడి పనిచేసినందుకు నాకు కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ భూకబ్జా కేసు
నేను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా. పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ వెంటే నడిచా. చివరకు నా సొంత పనులు మానుకొని.. పర్సనల్ లైఫ్ ను త్యాగం చేసి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశా. ఇంతలా కష్టపడి పార్టీ అభివృద్ధికి తోడ్పడిన నాకు కేసీఆర్ భూకబ్జా గిఫ్ట్ ఇచ్చారు. భూదందా కేసులో ఇరికించారు. నా ఫ్యామిలి మెంబర్స్ కూడా ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు. దశాబ్దాల నుంచి ఒక్క కుటుంబం లెక్క ఉన్నాం. ఇలా చేస్తారని కలలో కూడా ఊహించలేదు.. అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.