YSRCP : అధికార పార్టీని వదిలి పోయేంత మూర్ఖులు వారు కారట
YSRCP : ఏపీలో అధికార పార్టీ నాయకులు కొందరు అసంతృప్తితో ఉన్నారని.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుతో విసిగి పోయిన వారు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల్లోనే చాలా వ్యతిరేకత వచ్చిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావు వైకాపాలో 2019 ఎన్నికల తర్వాత జాయిన్ అయ్యాడు. పార్టీలో ప్రాముఖ్యత లేదు అంటూ పార్టీ మారేందుకు రామారావు చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Paleti Ramarao : పుకార్లపై స్పందన…
పాలేటి రామారావు వైకాపాను వీడబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. ఆ విషయాన్ని స్వయంగా రామారావు మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఏపీలో ప్రజామోధ్యమైన పరిపాలన కొనసాగుతుంది. కనుక తాము పార్టీ వీడి పోవాల్సిన అవసరం ఏంటీ అంటూ ప్రశ్నించాడు. అధికార పార్టీని వదిలి పోయేంత మూర్ఖులం కాదు అన్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రామారావు పదవిలో లేకున్నా కూడా సాధ్యం అయినంత వరకు తన కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటూ ఉన్నాడట.
బలరాంతో విభేదాల గురించి…
గతంలో చీరాలలో నిరంకుశ పరిపాలన కొనసాగేది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్యే కరణం బలరాం అన్ని విధాలుగా నియోజక వర్గంను అభివృద్ది చేస్తున్నాడు కనుక పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదు అంటూ ఈ సందర్బంగా మాజీ మంత్రి రామారావు అన్నాడు. ఎమ్మెల్యేతో విభేదాలు అంటూ వస్తున్న వార్తలను కూడా రామారావు కొట్టి పారేశాడు. వైకాపాను బలోపేతం చేసేందుకు అందరం కలిసి కట్టుగా పని చేస్తున్నామని, మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చేస్తామంటూ ఆయన వర్గీయులు కూడా అంటున్నారు.