SBI : ఎస్బీఐ కస్టమర్లకు అద్భుతమైన భీమా సౌకర్యాలు.. రూ.324 కే 4 లక్షల భీమా..
SBI : కరోనా పరిస్థితుల తర్వాత బీమాపై ప్రజలలో అవగాహన పెరిగింది. సమాజంలోని ప్రతి వర్గానికి చేరుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ మొత్తానికి బీమా సదుపాయాలను అందిస్తోంది. ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతా కలిగిన వారు ఏడాదికి రూ.342 చెల్లిస్తే రూ.4 లక్షల విలువ గల భీమా ప్రయోజనం పొందొచ్చు.కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన(పీఎంఎస్‌బీవై), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేవీవై) రూ.4 లక్షల వరకు ప్రమాద బీమా, అలాగే జీవిత బీమా అందిస్తున్నాయి. అయితే, దీని కోసం మీరు కేవలం రూ.342 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ రెండు పథకాల గురించి సమాచారాన్ని షేర్ చేసింది. ఎస్‌బీఐ కస్టమర్లు ఆటో డెబిట్ సదుపాయం ద్వారా ఖాతాదారుడి సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం కట్ అవుతుంది.ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద బీమా తీసుకున్న ఉన్న వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా పూర్తిగా వికలాంగులైనా రూ.2 లక్షల పరిహారం లభిస్తుంది. ఈ పథకం కింద బీమా చేసిన వ్యక్తి పాక్షికంగా లేదా శాశ్వతంగా వైకల్యం ఏర్పడితే లక్ష రూపాయల పరిహారం లభిస్తుంది.
SBI : ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన..
దీనిలో 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా చేరవచ్చు. ఈ ప్లాన్ వార్షిక ప్రీమియం కూడా రూ.12 మాత్రమే.ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేసిన వ్యక్తి మరణిస్తే నామినీకి రూ.2 లక్షలు వరకు పరిహారం లభిస్తుంది. 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఏ వ్యక్తి అయినా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం కోసం కేవలం రూ.330 వార్షిక ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఈ బీమా ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఈ బీమా కవర్ జూన్ 1 నుంచి మే 31 వరకు ఉంటుంది. భీమా పొందాలంటే మీరు బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. ప్రీమియం మినహాయింపు సమయంలో బ్యాంకు ఖాతా మూసివేయడం లేదా ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కూడా బీమాను రద్దు చేసుకోవచ్చు.