SBI Good News : ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు అందులోనే ఎక్కవ వడ్డీ.. లక్షల్లో ఆదాయం
SBI Good News : డబ్బులు పొదుపు చేయాలనుకుంటే చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రయివేటు సంస్థలు ఇలా చాలానే ఉన్నాయి. ఒక్కో బ్యాంక్ ఒక్కో వడ్డీ రేటును అమలు చేస్తాయి. బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచగా, ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్‌దారులకు గుడ్‌న్యూస్ తెలిపింది. అలాగే పోస్టాఫీస్‌లో 1, 2, 3, 5 ఏళ్ల మెచ్యూరిటీ కాలంతో టర్మ్ డిపాజిట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన వడ్డీ రేటు మారుతుంది. ఏడాది నుంచి మూడళ్లలోని టర్మ్ డిపాజిట్లకు 5.5 శాతం వడ్డీ వస్తుంది. అదే ఐదేళ్ల టెన్యూర్‌లోని టర్మ్ డిపాజిట్‌కు అయితే 6.7 శాతం వడ్డీ పొందొచ్చు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఈ రెండు పథకాలలో ఏది ఎక్కువ వడ్డీ చెల్లిస్తుందో ఇప్పుడు తెలసుకుందాం..
ఈ రెండూ కూడా మంచి పథకాలే. రెండింటికి ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది. రాష్ట్ర బ్యాంకులు ఎఫ్డీలని, పోస్టాఫీసులు టైమ్ డిపాజిట్ పథకాలని అమలు చేస్తాయి. రెండింటిలో డబ్బుకు పూర్తి భద్రత, హామీ ఉంటుంది.అయితే కస్టమర్లు ఎక్కువ ఆదాయం ఎక్కడ నుంచి వస్తుందో అక్కడే పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తాడు. ఎస్బీఐ ఎఫ్డీ , పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఈ రెండు పథకాలలో సమాన మొత్తాన్ని 5 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే ఎక్కడ ఎక్కువ రాబడిని వస్తుందో తెలుస్తుంది. వడ్డీ రేట్లు, కాల వ్యవధి మధ్య వ్యత్యాసాన్ని పరిశీలిస్తే దాదాపు 1.3 శాతం తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్బీఐ ఎఫ్డీ పై వడ్డీ 5.4%, పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ పై 6.7% వడ్డీ లభిస్తుంది. వీటి ప్రకారం ఆదాయాలలో వ్యత్యాసం 1.3 శాతం అవుతుంది.
SBI Good News : పోస్టాఫీస్ టైం డిపాజిట్ లో..
అందువల్ల బ్యాంక్‌లో కన్నా పోస్టాఫీస్‌లో డబ్బులు డిపాజిట్ చేసుకుంటే అధిక వడ్డీని పొందవచ్చు. అలాగే డబ్బుకు కేంద్ర ప్రభుత్వపు హామీ ఉంటుంది. పెద్దగా రిస్క్ ఉండదు.స్టేట్ బ్యాంక్ ఎఫ్డీల కాలవ్యవధి పెట్టుబడి అవసరాన్ని బట్టి ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. పోస్టాఫీసు టీడీ పథకాలు ఒక సంవత్సరం, రెండు, మూడు లేదా ఐదు సంవత్సరాలు ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఉపయోగించి ఎస్బీఐ ఎఫ్డీ ఖాతాను సులభంగా ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయవచ్చు. అయితే పోస్టాఫీసులో టీడీ ఖాతాను తెరవడానికి కచ్చితంగా పోస్టాఫీసు శాఖను సందర్శించాలి. సాధారణ ప్రజలకు ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు 2.90% నుంచి 5.40% మధ్య ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ వడ్డీ రేట్లు 5.50% నుంచి 6.70% వరకు ఉన్నాయి.