Post Office : అదిరిపోయే సేవింగ్స్ పథకం.. ఐదేళ్లలోనే రూ.7లక్షలు మీ చేతికి..!
Post Office : సాధారణంగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చిన్నమొత్తాల పొదుపు, సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అధిక వడ్డీని ఆశ చూపిస్తున్నాయి. మరికొన్ని టర్మ్ డిపాజిట్లపై ఉత్తమ ఆఫర్లను ప్రకటిస్తూ వస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగం ఆధీనంలో నడిచే పోస్టాఫీసు తక్కువ పెట్టుబడితో అత్యధిక రాబడి వచ్చే విధంగా పథకాలను తీసుకొచ్చింది. ప్రస్తుతం పోస్టాఫీసుల్లో కూడా బ్యాంకుల మాదిరి మంచి మంచి పొదుపు పథకాలను వినియోగదారుల కోసం రూపొందించాయి.
పోస్టల్ శాఖ కూడా అనేక పథకాలను తీసుకురాగా అందులో సేవింగ్స్ కూడా ఉన్నాయి. ఈ స్కీమ్‌లో చేరాలంటే 60 ఏళ్లు పై బడిన వారు అర్హులు. వీరు ప్రతినెలా రూ.8,334 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయం ఐదేళ్లు పూర్తయ్యాక రూ.7లక్షల వరకు పొందవచ్చును. ఈ లెక్కన ఏడాదికి రూ. లక్ష రూపాయాలు డిపాజిట్ చేస్తారు. ఐదేళ్ల పాటు డిపాజిట్ చేస్తే రూ.5లక్షలు అవుతుంది. మెచూరిటీ ముగిసాక మీ చేతికి రూ.7 లక్షలు అందుతాయి. దీనికి రూ.7.4 వడ్డీ ఇస్తున్నారు.
Post Office : నెలకు 8 వేల చొప్పున ఐదేండ్లకు రూ.7లక్షల ప్లాన్
ఈ పథకంలో చేరిన వారికి రూ.7.4శాతం వడ్డీ రేటు ఉంటుంది. దీని ప్రకారం మొత్తం రూ.1.85 వేల వడ్డీ వస్తుంది. మొత్తం ఐదేళ్లలో రూ.6,58వేలు డబ్బులు చేతికి అందుతాయి. ఈ స్కీమ్ కింద వడ్డీ త్రైమాసికానికి లెక్కించబడుతుంది. ప్రతి త్రైమాసికంలో ఖాతాదారుడు 9,250 వడ్డీ మొత్తాన్ని పొందుతాడు. దీని వలన మీరు మొత్తంగా ఐదేళ్లలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే.. మీకు అదనంగా రూ.1.85 వేలు చేకూరుతాయి. ఇలాంటి ప్లాన్స్ కోసం వెతుకుతున్న వారు వెంటనే పోస్టల్ డిపార్ట్మెంట్స్ సేవింగ్స్ మీద లాగిన్ అయి మీకు కావాల్సిన స్కీం ఎంచుకోండి.