Karnataka : కర్నాటకలో గెలుపు ఎవరిదో ఈ ఒక్క దెబ్బతో తేలిపోయింది !
Karnataka : కర్నాటకలో నిన్ననే ఎన్నికలు పూర్తయ్యాయి. మే 10న ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం 65 వరకు జరిగింది. అంటే కర్నాటక ప్రజలు 35 శాతం వరకు ఓట్లు వేయలేదు. 65 శాతం మంది కర్నాటక ప్రజలు వేసిన ఓట్ల ప్రకారమే విజేత ఎవరో డిసైడ్ అవుతారు. అయితే.. విచిత్రంగా ఈసారి కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలువబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అసలు.. బీజేపీ పోరును తట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎలా కర్నాటకలో పుంజుకుంది అనేదా ప్రశ్నార్థకంగా మారింది.
ఏ ఎగ్జిట్ పోల్స్ లో చూసినా.. ఏ సర్వే సంస్థ చూసినా కాంగ్రెస్ పార్టీదే హవా అంటున్నారు. పీపుల్స్ పల్స్ సంస్థ సౌత్ ఫస్ట్ నిర్వహించిన సర్వేలోనూ అదే తేలింది. కాంగ్రెస్ పార్టీకి 120 వరకు సీట్లు వస్తాయట. 120 వరకు సీట్లు వస్తే మ్యాజిక్ ఫిగర్ ను దాటవేసినట్టే. వేరే పార్టీల అవసరం లేకుండా.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇదే సర్వే సంస్థ బీజేపీకి 90 వరకు సీట్లు వస్తాయని చెప్పింది. ఇక.. మరో పార్టీ జేడీఎస్ కు 30 వరకు సీట్లు వస్తాయని చెప్పింది. ఇతరులు, స్వతంత్రులు ఒక మూడు నాలుగు సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Karnataka : సిద్ధరామయ్యే సీఎం అవుతారా?
ఇక.. సీఎం రేసులో చూస్తే కాంగ్రెస్ పార్టీ నేత సిద్ధరామయ్య ముందువరుసలో ఉన్నారు. ఆయనకు 42 శాతం మంది ఓటర్లు సై అన్నారట. బీజేపీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి 24 శాతం మంది ఓటర్లు ఓకే చెప్పగా.. జేడీఎస్ నేత యడియూరప్పకు 14 శాతం మంది ఓటర్లు సై అన్నారు. డీకే శివకుమార్ కు 3 శాతం మంది ఓటర్లు ఓకే చెప్పారు. కర్నాటకలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 113. అయితే.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య తీవ్రమైన పోరు ఉందట. ఆ రెండు పార్టీల మధ్య వ్యత్యాసం కేవలం 6 శాతమే ఉంటుందట.