Eye Care Tips | స్వీట్స్ ఎక్కువ తింటున్నారా.. కంటి చూపు పోయే ప్రమాదం..!
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా అధ్యయనాలు చెబుతున్నట్టుగా అధిక చక్కెర వినియోగం కంటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది కేవలం మధుమేహ రోగులకు మాత్రమే కాకుండా, ఆరోగ్యకరమైన వ్యక్తులకూ ప్రమాదాన్ని పెంచుతుంది.

#image_title
చక్కెర వల్ల కంటికి వచ్చే సమస్యలు
* డయాబెటిక్ రెటినోపతి : అధిక చక్కెర రెటీనాలోని చిన్న రక్త నాళాలను దెబ్బతీసి చూపు మసకబారడానికి దారితీస్తుంది.
* కంటి ఒత్తిడి : దీర్ఘకాలికంగా రక్తంలో చక్కెర పెరగడం వల్ల కళ్ళలో ఒత్తిడి పెరిగి నొప్పి కలుగుతుంది.
* చూపు మసకబారడం : రాత్రి సమయంలో చూపు తగ్గిపోవడం, డ్రైవింగ్‌లో ఇబ్బంది కలగడం సాధారణ లక్షణాలు.
* నల్లటి మచ్చలు, ఇన్ఫెక్షన్లు : కంటి ముందు నల్లటి బొట్లు కనిపించడం, తరచుగా కంటి వాపు, ఇన్ఫెక్షన్లు రావడం కూడా హెచ్చరిక సంకేతాలు.
నిపుణుల అభిప్రాయం
చక్కెర ప్రభావం కంటిపై పడినప్పుడు తొలుత గుర్తించడం కష్టమే. కానీ దృష్టి మసకబారడం, రాత్రివేళ చూపు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనబడితే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి” అని హెచ్చరించారు.
జాగ్రత్తలు
* రోజువారీ ఆహారంలో చక్కెర పరిమితంగా తీసుకోవాలి .
* మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి.
* కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాహారాలు తీసుకోవాలి.